భారీ విస్తరణ ప్రణాళికల్లో GMRఎయిర్ పోర్ట్ విభాగం

2021-01-28 10:18:04 By Y Kalyani

img

భారీ విస్తరణ ప్రణాళికల్లో GMRఎయిర్ పోర్ట్ విభాగం

జీఎంఆర్‌ గ్రూపునకు చెందిన జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌GHIAL విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది కంపెనీ. సుమారు రూ.2,190 కోట్లును అంతర్జాతీయ మార్కెట్‌లో డెట్ బాండ్స్ జారీ ప్రక్రియ ద్వారా సమీకరించి నిధులు వినియోగించనుంది. అయిదేళ్ల కాల పరిమితి ఉండే బాండ్స్ పత్రాలకు 4.75 శాతం వడ్డీ రేటు నిర్ణయించింది. ఇన్వెస్టర్లు కూడా ముందుకరావడంతో కంపెనీ ప్లానింగ్ రెడీ అయిపోయింది. జీఎంఆర్‌ గ్రూపుపైనా, జీహెచ్‌ఐఏఎల్‌ పరపతి సామర్ధ్యపైనా ఇన్వెస్టర్ల నమ్మకం మరోసారి గుర్తుచేసిందన్నారు కంపెనీ ప్రతినిధులు. జీఎంఆర్‌ గ్రూపు నిర్వహణలోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా గత ఏడాది 2.1 కోట్ల మంది రాకపోకలు సాగించారు. దీనిని 3.4 కోట్లకు పెంచాలని జీఎంఆర్‌ గ్రూపు నిర్ణయించింది. ఇందులో భాగంగా విస్తరణలో భాగంగా పలు ఆధునిక సదుపాయాలతో పాటు.. కొత్త ప్రాంతాలకు సర్వీసులు పెంచే ఆలోచనలో కంపెనీ ఉంది.  

Expert's View


MTAR Technologies కాసుల వర్షం కురిపిస్తుందా?

Trending