2లక్షల కోట్ల డాలర్లకు క్రిప్టో వ్యాపారం

2021-04-07 23:25:12 By Y Kalyani

img

2లక్షల కోట్ల డాలర్లకు క్రిప్టో బిజినెస్

బిట్‌కాయిన్ ఆధితప్యం సాగిస్తున్న గ్లోబల్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ సంస్థాగత డిమాండ్ నేపథ్యంలో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 2 ట్రిలియన్ డాలర్లను తాకింది. తొలిసారిగా ఈ మార్కును అందుకున్నాయి. 2021లో దాదాపు రెట్టింపు ధర పెరిగిన బిట్‌కాయిన్ ఒక్కటే 1 ట్రిలియన్ల డాలర్లకు పైగా ఉంది. ప్రస్తుతం ఈ వర్చువల్ కరెన్సీ 57,000డాలర్ల వద్ద ఉంది. ఇతర కీ క్రిప్టోకరెన్సీలు అయిన ఎథెరియం, బినాన్స్ కాయిన్, పోల్కాడోట్, టెథర్ మరియు కార్డానో లు కలిపి మొత్తం విలువ 422 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా బిట్‌కాయిన్‌ను చెల్లింపులను స్వీకరించడం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. జనాదరణ పొందిన క్రిప్టోకరెన్సీతో తమ సంస్థకు చెల్లించే విధానం ఈ ఏడాది చివర్లో ఇతర దేశాలకు అందుబాటులోవస్తుందని టెస్లా ప్రకటించింది. 1.5  బిలియన్లను బిట్‌కాయిన్లలో పెట్టుబడి కూడా పెట్టింది. వీళ్లతో పాటు పలు బ్యాంకులు కూడా వీటిని అనుమతిస్తుండడంతో భారీగా డిమాండ్ పెరిగింది. వాటి ధరలు పెరుగుతున్నాయి.  ఈ ఏడాది వరుసగా బిట్‌కాయిన్, ఎథెరియం 100 శాతం, 190 శాతం వృద్ధి చెందాయి.  అయితే భారతదేశంలోని క్రిప్టోకరెన్సీని నిషేధించేందుకు రెడీ అవుతోంది. అయితే అలాంటి నిర్ణయం సరికాదని అంటున్నారు నిపుణులు. భారతదేశం బహుశా తన సొంత డిజిటల్ కరెన్సీని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending