IPO టాక్.. GLENMARK లైఫ్ సైన్సెస్ తీసుకొవచ్చా

2021-07-28 08:00:46 By Y Kalyani

img

IPO టాక్.. GLENMARK లైఫ్ సైన్సెస్ తీసుకొవచ్చా

GLENMARK లైఫ్ సైన్సెస్ కంపెనీ ఐపీఓకు వచ్చింది. మరి దీనిని తీసుకోవచ్చా లేదా... కంపెనీ ప్రొఫైల్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సబ్ స్క్రిప్షన్ తేదీలు:  జులై 27- 29
ప్రైస్ బ్యాండ్ :           రూ.695-720
ఇష్యూ సైజ్ :           రూ.1513,6

ఐపీఓ ద్వారా వచ్చే డబ్బును కంపెనీ API వ్యాపారాన్ని విస్తరించడానికి మరియు వర్కింగ్ కేపిటల్, జనరల్ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తారు.

కంపెనీ గురించి...
కంపెనీ 2011లో ఇన్ కార్పొరేట్ అయింది. ఇది పూర్తిగా గ్లేన్ మార్క్ ఫార్మాస్యూటికల్ సంస్థకు సబ్సిడీ సంస్థ. క్రానిక్ డిసీజెస్ API నాన్ కమాడిటైజ్డ్ హై వాల్యూ ఔషధాల డెవలప్ చేయడంతో పాటు మ్యానుఫాక్చరర్ విభాగంలో లీడింగ్ సంస్థగా ఉంది. గ్యాస్ట్రో మరియు పేగు సంబంధ వ్యాధులకు అవసరమైన మందులను కంపెనీ తయారుచేస్తోంది. మార్చి 31 నాటికి కంపెనీకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 120 మాలిక్యుల్స్ ఉన్నాయి.  దేశీయంగానే కాదు విదేశాలకు కూడా ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం నాలుగు ఉత్పత్తి కేంద్రలున్నాయి. మొత్తం కేపాసిటీ ఏడాదికి 726.6 KL గా ఉంది. ఈ రంగంలో గట్టి పోటీనే ఉంది. ఇప్పటికే దివిస్, లారస్ ల్యాబ్స్, శిల్పా, ఆర్తి, సోలారా వంటి కంపెనీలు లిస్ట్ అయ్యాయి. 

కంపెనీ మనీ మేటర్స్...
రెవిన్యూ FY21- 1885 కోట్లు PAT - 352 కోట్లు 
రెవిన్యూ FY20- 1537 కోట్లు PAT - 313 కోట్లు
రెవిన్యూ FY21- 886 కోట్లు PAT - 196 కోట్లు

బలాలు..
కంపెనీ బలం ఏంటంటే... కొన్ని విభాగాల్లో కంపెనీ లీడర్ గా ఉంది. ముఖ్యంగా హైవాల్యూ APIలో. ప్రపంచవ్యాప్తంగా జనరిక్ కంపెనీలతో స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. FY22నాటికి అంకేశ్వర్ ఫెసిలిటీ విస్తరణ చేపట్టింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం కూడా దహేజ్ ఫెసిలిటీ విస్తరణకు కూడా ప్రణాళికలు వేసింది. 

బలహీనతలు..
కంపెనీ ఆదాయం కోసం ఇప్పటికీ పేరెంట్ కంపెనీ, ఇతర సబ్సిడీలప ఆధారపడుతోంది. కీ కస్టమర్ కు విక్రయంపైనే వ్యాపారం ఆధారపడి ఉంది. పరిమితంగానే ఉత్పత్తి అవుతున్న మందులపై మాత్రమే అధికంగా ఆదాయం వస్తుంది. ఏమాత్రం ఉత్పత్తిలో అంతరాయం, రిడక్షన్, ఆలస్యం అయినా భారీగా నష్టం వస్తుంది. వర్కింగ్ కేపిటల్ అవసరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కస్టమర్ నుంచి ప్రైసింగ్ ప్రెజర్ కూడా లాభాలపై పడుతుంది. ప్రభుత్వ అనుమతులు మేరకే విస్తరణ.

కంపెనీ ప్రొఫైల్ క్లుప్తంగా ఇవ్వడం జరిగింది... నిర్ణయం మీదే.. ఇది కేవలం అందుబాటులో ఉన్న సమాచారం. దీనిపై పూర్తి వివరాల కోసం https://www.profityourtrade.in/ సంప్రదించవచ్చు. 


ipo market trading drhp SEBI glenmark

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending