తొలి త్రైమాసికంగా భారీగా లాభాలను ఆర్జించిన గ్లాండ్ ఫార్మా, 52వారాల గరిష్టానికి షేర్

2021-07-22 10:34:48 By VANI

img

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన గ్లాండ్‌ ఫార్మా 11.83 శాతం పెరిగి రూ.350.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.313.6 కోట్ల లాభంతో పోలిస్తే 12 శాతం పెరిగినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. కన్సాలిడేటెడ్ ఆదాయం 31 శాతం వృద్ధితో రూ.884.2 కోట్ల నుంచి రూ.1,153.9 కోట్లకు చేరింది. కొత్త ఔషధాల రిలీజ్‌తో పాటు ఉన్న ఔషధాల విక్రయం అన్ని మార్కెట్లలోనూ భారీగా పెరగడంతో ఆదాయం సైతం పెరిగిందని ఎండీ, సీఈఓ శ్రీనివాస్‌ సాధు తెలిపారు.  


‘‘దేశంలో కొవిడ్ సెకండ్‌వేవ్ నడుస్తున్నప్పటికీ, మ్యాన్‌పవర్‌కి సంబంధించిన ఇబ్బందులతో పాటు సప్లై చైన్ అడ్డంకులున్నప్పటికీ గ్లాండ్ ఫార్మా త్రైమాసికంగా అద్భుతమైన ఫలితాలను సాధించగలిగింది’’ అని శ్రీనివాస్ సాధు వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ కీలక మార్కెట్లు, యూఎస్, కెనడా, యూరప్, ఆస్ట్రేలియాలలో 16 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అలాగే 61 శాతం ఆదాయాన్ని పొందినట్టు గ్లాండ్ ఫార్మా తెలిపింది. మిగతా గ్లోబల్ మార్కెట్‌లో సైతం 51 శాతం వృద్ధిని సాధించినట్టు గ్లాండ్ ఫార్మా వెల్లడించింది. 


 


Gland pharma