మళ్లీ పెరుగుతున్న FPIల పెట్టుబడులు

2022-01-17 09:11:48 By Y Kalyani

img

మళ్లీ పెరుగుతున్న FPIల పెట్టుబడులు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు భారతీయ మార్కెట్లలో రూ. 3,117 కోట్ల పెట్టుబడులు పెట్టడం కొంతవరకు గుడ్ న్యూస్. మూడు నెలల వరుస విక్రయాల పరంపరకు భిన్నంగా జనవరిలో పెట్టుబడులు రావడం విశేషం. జనవరి 1-14 మధ్య కాలంలో రూ.1,857 కోట్లను ఈక్విటీల్లోకి, రూ.1,743 కోట్లను హైబ్రిడ్ సాధనాల్లోకి పంపినట్లు డిపాజిటరీల డేటా వెల్లడించింది. అదే సమయంలో, వారు రుణ విభాగం నుండి రూ. 482 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో నెట్ ఇన్‌ఫ్లో రూ. 3,117 కోట్లకు చేరుకుంది. ఓవర్సీస్ ఇన్వెస్టర్లు అక్టోబర్ 2021 నుండి వరుసగా మూడు నెలల పాటు భారతీయ మార్కెట్లలో నెట్ సెల్లర్స్ గా ఉన్నారు. 
ఐటి మేజర్ల ఎర్నింగ్స్ మెురుగ్గా ఉండటంతో ఐటి స్టాక్‌లు పుంజుకున్నాయి. యూనియన్ బడ్జెట్ కూడా ఉన్నందున FPIలు మార్కెట్‌లలో గణనీయంగా పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 
ఒమిక్రాన్ కేసులలో పెరుగుదల, పెరిగిన ద్రవ్యోల్బణం మరియు యుఎస్ రేటు పెంపు అంచనాల మధ్య, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఎఫ్‌పిఐ ప్రవాహాలు అస్థిరంగానే ఉంటాయన్నఅనుమానం కూడా ఉంది. 


FPI FII jan data

Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending