మాజీ సీఎం రోశయ్య ఇక లేరు

2021-12-04 10:03:21 By Y Kalyani

img

మాజీ సీఎం రోశయ్య ఇక లేరు

మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. లో-బీపీతో అకస్మాత్తుగా ఇంట్లో కిందపడిపోయారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయం బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో ఉంది. ఆకస్మిక మరణంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు.  
రోశయ్య 4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. 
1968, 74, 80లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.
1979లో అంజయ్య ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు
1982లో కోట్ల మంత్రివర్గంలోనూ హోంశాఖ మంత్రిగా వ్యవహరించారు
1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రోడ్లు రహదారులశాఖ, రవాణా, విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేశారు. 
1991లో మరోసారి నేదురుమల్లి కేబినెట్లో ఆర్థిక, విద్య, విద్యుత్ శాఖలు 
1992లో కోట్ల కేబినెట్లో విద్య, విద్యుత్, ఆర్ధిక
2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రోశయ్య గెలిచారు ఉమ్మడి ఏపీలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు
2004 నుంచి వరసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు ఉంది.
మొత్తం 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర రోశయ్యది

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంతో 3 సెప్టెంబర్ 2009-25 జూన్ 2011 వరకూ ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నారు
ఆగస్ట్ 2011 నుంచి ఆగస్ట్ 2016 వరకూ తమిళనాడుకు గవర్నర్‌ పనిచేశారు. 


rosiah nomore ex cm