లాక్ డౌన్ 2.0 తర్వాత బెస్ట్ స్టాక్స్ ఇన్వెస్టింగ్ స్టాక్స్ FMCG

2021-06-19 22:55:02 By Y Kalyani

img

లాక్ డౌన్ 2.0 తర్వాత బెస్ట్ స్టాక్స్ ఇన్వెస్టింగ్ స్టాక్స్ FMCG

కొవిడ్ దేశ గతిని మార్చేసింది. ప్రజల జీవన విధానం.. వారి అలవాట్లు.. ఖర్చులు సర్వం తిరగరాసింది. స్టాక్ మార్కెట్లో కూడా కొన్ని స్టాక్స్ కు డిమాండ్ పెంచింది. మరికొన్ని స్టాక్స్ ను నష్టాల పాలు చేసింది. టూరిజం, ట్రావెల్, మల్టీ ప్లెక్స్ దెబ్బతిన్నాయి. FMCG, ఉత్పత్తి రంగాలు ఊపందుకున్నాయి. కొన్ని సెక్టార్లపై భయాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ సమయంలో ముఖ్యంగా లాక్ డౌన్ 2.0 తర్వాత ఎందులో ఇన్వెస్ట్ చేయాలి. ఏ స్టాక్స్ లో పెడితే మంచి ప్రాఫిట్స్ వస్తాయని ట్రేడర్స్ భావిస్తుండవచ్చు. అయితే బెస్ట్ FMCG అంటున్నారు ఎనలిస్టులు. దీనికి కారణాలు కూడా విశ్లేషిస్తున్నారు..

ప్రజలు ఆలోచన మారింది...
వాస్తవానికి కరోనా కారణంగా ప్రజలపై ఆర్ధికభారం పెరిగింది. ఆసుపత్రుల ఖర్చులు పెరిగాయి. ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. వారి వద్ద సేవింగ్స్ అన్నీ కూడా దాదాపు హారతి కర్పూరం అయ్యాయి. అప్పులు పెరుగుతున్నాయి. బ్యాంకుల్లో పేరుకుపోతున్న NPAలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఇటీవల రికార్డు స్థాయిలో ECSలు కూడా బౌన్స్ అవుతున్నాయి. అంటే పరిస్థితి ఎలా అర్ధం చేసుకోవచ్చు. 
ఈ సమయంలో ప్రజలు ఫుడ్, హెల్త్ మాత్రమే ముఖ్యం. లగ్జీర అనే పదానికి కొన్నేళ్ల పాటు దూరంగా ఉంటారు. క్లాతింగ్, జ్యూయలరీ, హోమ్ రెన్నోవేషన్, లగ్జరీ ప్రోడక్ట్స్ వివాహాలు వంటివి ఇప్పట్లో కష్టమే. వాటిపై ఆధారపడ్డ కంపెనీల స్టాక్స్ కూడా ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. 

FMCGఅందుకుంటుంది...
సరిగ్గా ఇదే సమయంలో FMCGబెస్ట్ ఆఫ్షన్. కనీస అవసరాలు ముఖ్యం. ఇటీవల మంచి సానుకూల సంకేతాలు కూడా వచ్చాయి. ఈ సంవత్సరం గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ అధ్బుతంగా ఉంటుందని అంచనాలున్నాయి. రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తులు రానున్నాయి. ఇది వరసగా ఐదో సంవత్సరం. ఇక వర్షపాతం కూడా నార్మల్ గాఉంటుందని..కరువు చాయలు లేవని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం బియ్యం, నగదు సాయం కంటిన్యూచేస్తోంది. ఖరీష్ కారణంగా రూరల్ లో అసలు లాక్ డౌన్ ప్రస్తావన లేదు. కాబట్టి గ్రామీణ భారతంలో భారీగా డిమాండ్ FMCGకి ఉంది.  

HUL, Dabur,వరుణ్, మోల్డ్ టెక్ Nestle వంటి రూరల్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ మంచి బూమ్ ఉంటుంది. వీటిని మంచి నెట్వర్క్ ఉంది. సరఫరా వ్యవస్థ ఉంది. ప్రతిఒక్కరి అవసరం.. కాబట్టి ఈ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే రానున్న కొద్ది వారాల్లో బెటర్ రిటర్న్ ఆశించవచ్చు. 


fmcg market stocks shares hul nestle