మార్కెట్లో దుమ్ము రేపిన మ్యూచువల్ ఫండ్స్ ఇవే

2021-10-23 22:12:49 By Y Kalyani

img

మార్కెట్లో దుమ్ము రేపిన మ్యూచువల్ ఫండ్స్ ఇవే
100శాతానికి పైగా ప్రాఫిట్ ఇచ్చిన ఇన్ ఫ్రా

మార్చి 2020 నుండి మార్కెట్ ర్యాలీలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ప్రధానంగా లాభపడ్డాయి. సహజంగానే  అటువంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్‌లు కూడా అద్భుతమైన రాబడులను అందించాయి. వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గత ఏడాది కాలంలో కొన్ని ఫండ్స్ పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేశాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ప్రధానంగా పవర్, కన్‌స్ట్రక్షన్, క్యాపిటల్ గూడ్స్ మరియు మెటల్స్ విభాగాలలోని కంపెనీల స్టాక్‌లలో పెట్టుబడి పెడుతుంటాయి. డబుల్ ఆనందం ఇచ్చిన ఫండ్స్ ఒక్కసారి చూద్దామా..

Quant Infrastructure fund
క్వాంట్ ఇన్ ఫ్రా ఫండ్ గడిచిన ఏడాది కాలంలో దాదాపు 118 శాతం రిటర్న్ ఇచ్చింది. ఈ కేటగిరిలో టాప్ లో ఉఏంది. ఈ స్కీములో కార్పస్ రూ.85 కోట్ల వరకూ ఉంది. 

ICICI Prudential Infrastructure fund
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గత సంవత్సరంలో 108.6 శాతం రాబడితో జాబితాలో రెండో స్థానంలో ఉంది. రూ .1,680 కోట్ల అసెట్ వాల్యూతో ఈ విభాగంలో అతిపెద్ద స్కీముగా ఉంది. పవర్, ఎనర్జీ, కన్ట్రక్షన్, ఫైనాన్షియల్ స్టాక్స్ ఫండ్ లో ఉంది. ఫండ్ ఆస్తులలో 61 శాతం లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేశారు. 

IDFC Infrastructure fund
IDFC ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లో ఇన్వెస్టర్లకు ఏడాదిలో 104.8 ప్రాఫిట్ ఇచ్చింది.  నిర్మాణం, సిమెంట్, విద్యుత్ మరియు ఇంధన రంగంలోని సంస్థల ఇన్వెస్ట్ చేసింది. ఇది రూ .650 కోట్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తుంది. 

HSBC Infrastructure Equity fund
HSBC ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈక్విటీ ఫండ్ గత ఏడాది కాలంలో దాదాపు 102 శాతం రాబడిని అందించింది. ఇది రూ .112 కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. 

Aditya Birla Sun Life Infrastructure fund 
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గత ఏడాదిలో 97.4 శాతం రాబడితో ఇన్వెస్టర్లకు మంచి ప్రాఫిట్ ఇచ్చింది. 570 కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. ఫండ్ పోర్ట్‌ఫోలియోలో నిర్మాణం, ఇంజనీరింగ్, ఎనర్జీ మరియు మెటల్ స్టాక్స్ ఉన్నాయి.


market shares mutual funds latest news

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending