స్టాక్ మార్కట్ టాక్.. హెల్తీ కరెక్షన్ అనివార్యమా

2021-09-26 09:47:39 By Y Kalyani

img

స్టాక్ మార్కట్ టాక్.. హెల్తీ కరెక్షన్ అనివార్యమా

మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకునే ముందు హెల్తీ కరెక్షన్ ఉంటుందన్నది కాదనలేని సత్యం అంటున్నారు నిపుణులు.  ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కువస్తే దిద్దుబాటు ఉంటుంది. అంతేకాదు వాల్యూ బైయింగ్, బై-ఆన్-డిప్స్ ప్లాన్ ఎంచుకోవచ్చు. వీటి వల్ల కొంత కరెక్షన్ ఛాన్స్ ఉందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. 

FY22లో 65వేలుకు BSE...
హెల్తీ కరెక్షన్ వచ్చినా FY22 చివరి నాటికి 65,000 కి మార్కెట్ చేరుతుందని అంచనా వేస్తున్నారు. రాబోయే పండుగ సీజన్  Q2 ఎర్నింగ్స్ ర్యాలీలో కీలక పాత్ర పోషించనున్నాయి.  సెన్సెక్స్ సెప్టెంబర్ 24, 2021 న 60,000 మైలురాయిని తాకింది. అయితే 65,000 స్థాయి ఎంతో దూరంలో లేదంటున్నారు. Q4FY22 మధ్య లేదా FY22  చివరి నాటికి 65,000 స్థాయికి వస్తుందంటున్నారు.  దేశీయంగా, 10-20 శాతం వరకూ దిద్దుబాటు ఛాన్స్ ఉంది. గత కొన్ని సెషన్లలో డిఐఐలు మరియు ఎఫ్‌పిఐలు మంచి భాగస్వామ్యం కలిగి ఉన్నారు. అయితే, ఎవర్‌గ్రాండే, చైనాలో మందగమనం వల్ల స్వల్పంగా కరెక్షన్ ఛాన్స్ ఉంది. 
తక్కువ వడ్డీ రేట్లు, ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో ఉండడంతో ఈక్విటీ పెట్టుబడిదారులకు అనువైన సమయం. IT సెక్టార్ లో ఇంకా పెరుగుతుందని అంచనా. PSU బ్యాంకులు కూడా మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. 

గమనిక.. ఆయా బ్రోకరేజి సంస్థల నివేదికల ఆధారంగా ఇచ్చిన కథనం. కరెక్షన్, బుల్ ర్యాలీ అనేవి ఎవరూ ఖచ్చితంగా అంచనా వేయలేని అంశాలు. ఈ కథనం ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటే https://www.profityourtrade.in ఎలాంటి బాధ్యత వహించదు.


bse market trend m cap

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending