ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లేకుండానే ఇన్సూరెన్స్

2021-12-05 20:19:35 By Y Kalyani

img

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లేకుండానే ఇన్సూరెన్స్

ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ తమ స‌భ్యుల‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులపై ఎలాంటి భారం పడకుండానే రూ.7 ల‌క్ష‌ల ఉచిత బీమా క‌వ‌రేజీ ఇవ్వనుంది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం కింద ఈ సదుపాయం ఇస్తోంది. ఒక‌వేళ విధులు నిర్వ‌హిస్తున్న‌ప్పుడు మ‌ర‌ణిస్తే స‌భ్యుల నామినీ లేదా వార‌సుల‌కు రూ.7 ల‌క్ష‌ల వ‌ర‌కు చెల్లిస్తారు. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ అండ్ మిస్‌లేనియ‌స్ ప్రొవిజ‌న్స్ యాక్ట్‌-1976 కింద ఈపీఎఫ్‌వో స‌భ్యుల పేర్లు ఆటోమేటిక్‌గా ఈడీఎల్ఐ స్కీమ్‌లో న‌మోద‌వుతాయి. స‌భ్యుడి మ‌ర‌ణించడానికి ముందు 12 నెల‌లు తీసుకునే శాలరీ ఆధారంగా ఇన్సూరెన్స్ క‌వ‌రేజీ ఉంటుంది. సంస్థ చెల్లించే ఈపీఎఫ్‌వో 12 శాతంలో 8.33 శాతం పెన్ష‌న్ ఫండ్‌కు మ‌ళ్లిస్తారు. దీంతో పాటు ఈడీఎల్ఐ స్కీం కోసం యాజ‌మాన్యాలు 0.5 శాతం చెల్లిస్తాయి. 
విధులు నిర్వ‌ర్తిస్తుండ‌గా ఈపీఎఫ్‌వో స‌భ్యుడు మ‌ర‌ణించినట్ల‌యితే నామినీ లేదా వార‌సుల‌కు రూ.7 ల‌క్ష‌ల బెనిఫిట్ ల‌భిస్తుంది. ఇంత‌కుముందు ఇది రూ.6 ల‌క్ష‌లు చెల్లించేవారు. గ‌త ఏప్రిల్ నుంచి రూ.7 ల‌క్ష‌ల‌కు పెంచారు. 12 నెల‌ల మొత్తం వేత‌నంలో స‌గ‌టుపై 30 రెట్లు గానీ, గ‌రిష్ఠంగా రూ.7 ల‌క్ష‌లు గానీ ఇన్సూరెన్స్ క‌వ‌రేజీ ల‌భిస్తుంది. ఈ స్కీం కింద‌ రూ.2.5 ల‌క్ష‌ల బోన‌స్ కూడా చెల్లిస్తారు. ఈడీఎల్ఐ క‌ల్పిస్తున్న బీమా క‌వ‌రేజీలో ఎటువంటి మిన‌హాయింపులు ఉండ‌వు. పీఎఫ్‌, ఈపీఎఫ్ ఖాతాదారుల పేర్లు ఈడీఎల్ఐ బీమా స్కీమ్‌లో ఆటోమేటిక్‌గా న‌మోద‌వుతాయి.
కంపెనీలే చెల్లించాలి...
ఈపీఎఫ్‌వోలో స‌భ్యుడు లేదా స‌భ్యురాలు.. ఈపీఎఫ్ రిజిస్ట‌ర్డ్ కంపెనీ నుంచి వైదొలిగితే మాత్రం నామినీ గానీ, వార‌సులు గానీ.. బీమా క‌వ‌రేజీ కోసం క్ల‌యిమ్ చేసే హ‌క్కు లేదు. ఈడీఎల్ఐకి యాజ‌మాన్యాలు మాత్ర‌మే త‌మ వాటా చెల్లించాలి. ఉద్యోగుల వేత‌నం నుంచి మిన‌హాయించుకోరాదు.


EPFO pf latestnews insurance