డిక్సన్ టెక్నాలజీస్ హోరు..! రూ.180 పెరిగిన షేరు..! రీజన్ ఉంది గురు!

2021-04-08 10:20:58 By Anveshi

img

ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశీయంగా మంచి పేరున్న డిక్సన్ టెక్నాలజీస్ షేరు వరసగా రెండో రోజూ దూసుకుపోతోంది
నిన్నటి మన స్టోరీని  ఫాలో అయినవాళ్లకి ఇఁదులో స్ట్రెంగ్త్ కాస్త అర్ధమై ఉంటుంది. అలానే మార్కెట్లలో వీక్‌నెస్ ఉన్నా,కంటెంట్ సరిగా వాడుకుంటే మంచి ర్యాలీ చోటు చేసుకుంటుందనే నమ్మకం ఋజువు అయింది. 

డిక్సన్ టెక్నాలజీస్ షేరు గురువారం ఇంట్రాడేలో ఎర్లీ ట్రేడ్‌లోనే( ఉదయం 9.35కే) 5శాతం వరకూ పెరిగి రూ.3797ధరని తాకింది. భారతి ఎంటర్‌ప్రైజెస్‌తో సంస్థ ఓ జాయింట్ వెంచర్ నెలకొల్పనుండటం, అటు ఎయిర్‌టెల్‌కి ఇటు డిక్సన్ టెక్నాలజీస్‌కి ఉభయతారకంగా పనికి వస్తుందనేది ఇండస్ట్రీ టాక్. భవిష్యత్తులో సొంతంగా స్మార్ట్ ఫోన్ల తయారీ రంగంలోకి ఎయిర్‌టెల్  రానుండగా, దానికి ఉన్న కోట్లాది కస్టమర్ల బేస్ డిక్సన్ టెక్నాలజీస్‌కి భారీ సంఖ్యలో ఆర్డర్లను రెడీ చేస్తోంది.దీంతో పాటే ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ని మొదటి దశలో డిక్సన్ టెక్నాలజీస్ అందుకోలేకపోయినా, ఇప్పుడు కొత్త ఒప్పందాలతో ఆ మేరకు
లాభపడే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయ్. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మేన్యుఫేక్చరింగ్‌లో, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో డిక్సన్ టెక్నాలజీస్ లీడింగ్ ప్లేయర్ అందుకే మార్జిన్లు తక్కువైనా, ఆర్డర్లు ఎక్కువ తెచ్చుకోవడంతో లాభాలు కూడా ఎక్కువ గడించే అవకాశాలను ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. 

ఇదే కాదు నిన్న కేంద్రం అనౌన్స్ చేసిన సోలార్ ప్యానెళ్లు, ఏసీ, వాషింగ్ మెషీన్ల తయారీకి పిఎల్ఐ వర్తింపు డిక్సన్‌కి భారీగా ఉపయోగపడనుంది.వైట్ గూడ్స్ సెక్టార్‌లో కాంపొనెంట్లు తయారీ, అసెంబుల్ యూనిట్లకు రూ.6వేల కోట్లకిపైగా ఇన్సెంటివ్స్ ఇస్తామంటూ కేంద్రం చెప్పింది. ఐతే సింపుల్‌గా పూర్తైన ప్రొడక్ట్‌లను అసెంబుల్ చేసే యూనిట్లకు మాత్రం వర్తించదని మెలిక పెట్టింది. ఐతే ఇక్కడే డిక్సన్ టెక్నాలజీస్‌కి ఉన్న ఒరిజినల్ డిజైన్ మేన్యుఫేక్చరింగ్ మోడల్ బిజినెస్ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ ఒరిజినల్ డిజైన్ మేన్యుఫేక్చరింగ్ మోడల్ ఏంటో స్టోరీలో కింది భాగంలో చదవండి

విస్తరణ వ్యూహాలు
ఈ మధ్యనే కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ మేన్యుఫేక్చరింగ్ క్లస్టర్‌లో ఓ తయారీ యూనిట్ స్థాపించేందుకు వ్యూహం సిద్ధం చేసింది. అలానే తిరుపతిలోని ప్లాంట్‌ విస్తరణ చేస్తోంది. అలానే బాష్క్ కంపెనీతో  కలిసి వాషింగ్ మెషీన్ తయారీ యూనిట్ రెడీ చేసింది. 

బ్రాండ్ బిహైండ్ ది బ్రాండ్స్ 
ముందుగా డిక్సన్ టెక్నాలజీస్ వ్యాపారాన్ని అర్ధం చేసుకోవాలి. ఒకటి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మేన్యుఫేక్చరర్. ఇది చాలా  కంపెనీలు అనుసరించే మోడల్, కాంట్రాక్ట్ పద్దతిలో ఓ కంపెనీకి అవసరమైన ఉత్పత్తిని తయారు చేసి ఇవ్వడం. అంటే  కాంపొనెంట్స్, ఇతర మెటీరియల్ అంతా డిక్సన్ టెక్నాలజీస్ సేకరించి, కస్టమర్ అవసరాలకు తగిన విధంగా అసెంబుల్ చేసి ఇస్తుంది. అంటే ఫైనల్ ప్రొడక్ట్ ఎలా ఉండాలన్నది కాంట్రాక్ట్ ఇచ్చే కంపెనీ డిసైడ్ చేసిన విధంగా ఉంటుంది. ఇక రెండో మోడల్ ఒరిజినల్ డిజైన్ మేన్యుఫేక్చరర్. అంటే ఇక్కడ క్లయింట్ తనకి ఓ మంచి  ప్రొడక్ట్ కావాలని మాత్రమే అడుగుతారు. డిక్సన్  టెక్నాలజీస్‌కి ఈ రెండో పద్దతిలో కూడా మంచి అనుభవం ఉంది. ప్రొడక్ట్ డిజైన్ నుంచి ఫైనల్ ప్రొడక్ట్ వరకూ తనే తయారు చేసి ఇవ్వగలదు. ఈ మధ్యలో ముడి పదార్ధాలు, ఉత్పత్తులు, వస్తువులు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌తో సహా మొత్తం డిక్సన్  టెక్నాలజీసే చూసుకుంటుంది. అంటే డిక్సన్ టెక్నాలజీస్ కేవలం OEM పద్దతిలోనే కాదు ODM మోడల్‌లో కూడా దిట్ట అని అర్ధమవుతోంది. ఈ ఓడిఎం మోడల్ అయితేనే ఏ కంపైనీకైనా లాభాలు బాగా మిగులుతాయ్. కానీ ఎలక్టానిక్స్, ఎలక్ట్రికల్స్  విభాగంలో ఏ కంపెనీ కూడా ఓడిఎం పద్దతిలో కాంట్రాక్ట్ ఇవ్వడం లేదు. ఐతే వాషింగ్ మెషీన్ తయారీలో మాత్రం డిక్నన్ టెక్నాలజీస్‌కి ODM( ఒరిజినల్ డిజైన్ మేన్యుఫేక్చరర్)పద్దతిలో ఆర్డర్లు వస్తున్నాయ్. డిక్సన్ టెక్నాలజీస్ మొత్తం  ఆదాయంలో ఇలా వచ్చేది 9శాతం మాత్రమే. తాజాగా కేంద్రం ప్రకటించిన ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈ విభాగానికి మంచి జోష్ ఇవ్వనుంది

రెవెన్యూ గ్రోత్  హిస్టరీ

గత ఏడేళ్లలో సంస్థ రెవెన్యూ రూ.726 కోట్ల నుంచి రూ.4400కోట్లకి పెరగగా, నికరలాభం రూ.2 కోట్ల నుంచి రూ.120కోట్లకి పెరిగింది.మరి డిక్సన్ టెక్నాలజీస్‌కి ఏ విభాగంలో ఎంతెంత ఆదాయం వస్తుందో ఈ  చార్టులో చూడండి

ప్రస్తుతం డిక్సన్ టెక్నాలజీష్ షేర్లు 4శాతం పెరిగి రూ.3745వద్ద ట్రేడ్ అయ్యాయ్

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending