ఇన్వెస్టర్లకు షాకిచ్చిన క్రిప్టో కరెన్సీ

2021-12-05 20:29:36 By Y Kalyani

img

ఇన్వెస్టర్లకు షాకిచ్చిన  క్రిప్టో కరెన్సీ
గరిష్టస్థాయి నుంచి 30శాతం పతనం

కారణం లేదు.. ఎందుకో తెలియదు. బ్యాన్ చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ క్రిప్టో కరెన్సీ కుప్పకూలింది. ఒమిక్రాన్ దెబ్బ... అటు భారత్ లో పరిణామాలు భాగా డిస్ట్రబ్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలు పేకమేడలా కూలాయి. సౌతాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ అతితక్కువ సమయంలో అత్యధిక దేశాలను సుమారు 38కి పైగా దేశాల్లో వ్యాపించింది. దీంతో భయాలు మొదలై.. క్రిప్టోలో అమ్మకాల ఒత్తిడి మొదలైంది. స్టాక్ మార్కెట్లే కాదు.. క్రిప్టోలోనూ భయాలు వెంటాడుతున్నాయి. 
బిట్‌కాయిన్‌, ఈథర్‌లు శనివారం మార్కెట్లో కుప్పకూలాయి. ఒక దశలో బిట్‌ కాయిన్‌ 42,000 డాలర్ల దిగువకు వచ్చింది. ఇక ఈథరేయం కూడా 3,500 డాలర్ల దిగువకు చేరుకుంది. 15 శాతం వరకూ నష్టపోయాయి. బిట్‌ కాయిన్‌ శనివారం ఒక గంట వ్యవధిలోనే 10,000 డాలర్లు నష్టపోయింది. చివరకు 48,000 డాలర్ల వద్ద టచ్ అయింది. ఈథర్‌ కూడా తర్వాత కోలుకుని 3900 డాలర్లకు చేరుకుంది. నవంబరు 10న 69,000 డాలర్ల వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని చూసిన బిట్‌ కాయిన్‌ ఇపుడు 30 శాతం పడిపోయింది. కార్డనో, సొలానా, పాలీగాన్‌, షిబా వంటి క్రిప్టోకరెన్సీలు సైతం 13-20 శాతం వరకు నష్టాలను చవిచూశాయి.
అయితే క్రిప్టో మార్కెట్ ఎనలిస్టులు మాత్రం ఇది తాత్కాలికం అంటున్నారు. ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నవారికి మంచి బెటర్ టైమ్ అట. ప్రస్తుతం భయంతో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తున్నా త్వరలోనే మళ్లీ పెరుగుతుందట. ఏది ఏమైనా క్రిప్టో విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం ఇది.  


Crypto Currncy trading news downfall bitcoin down