-->

దేశీయ మార్కెట్లోకి కొనసాగుతున్న FPIలు

2021-01-11 08:03:38

img

దేశీయ మార్కెట్లోకి కొనసాగుతున్న FPIలు

ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్స్ జనవరిలో జరిగిన 6 సెషన్లలో ఇండయన్ కేపిటల్ మార్కెట్లోకి రూ.5,116 కోట్లు పంప్ చేశారు. త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్న భావనతో పాటుగా బడ్జెట్ పై పెరిగిన అంచనాలు కూడా విదేశీ మదుపుదారులను ఆకట్టుకుంటున్నాయి. డిపాజిటరీ డేటా ప్రకారం FPIలు రూ.4819 కోట్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా.. రూ.337 కోట్లు డెట్ సెగ్మెంట్లలో పెట్టారు. జనవరి 1,8 మధ్య జరిగిన 6 సెషన్లలో మాత్రమే. 
గత కేలండర్ ఇయర్ 2020లో రికార్డు స్థాయిలో FPIలు వచ్చాయి. ఎమెర్జింగ్ మార్కెట్లలో అత్యధికంగా రాబట్టింది ఇండియన్ మార్కెట్. 2021లోనూ ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది.