క్రిప్టో కరెన్సీపై పిడుగు లాంటి వార్త.. చైనాలో నిషేధం

2021-09-24 22:18:36 By Y Kalyani

img

క్రిప్టో కరెన్సీపై పిడుగు లాంటి వార్త.. చైనాలో నిషేధం

బిట్ కాయిన్ ఇత‌ర క్రిప్టో క‌రెన్సీల‌ ట్రేడింగ్‌, మైనింగ్ పై చైనా నియంత్రణ దిశగా మరిన్ని అడుగులు వేసింది. ఇందులో భాగంగా నిషేధం విధించింది. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న క్రిప్టో కరెన్సీపై డ్రాగన్ దేశం చైనా ఉక్కుపాదం మోపింది. క్రిప్టో అనేది ఫ్లాట్ కరెన్సీ కాదని తేల్చి చెప్పిన చైనా దీన్ని తమ దేశంలో నిషేధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చైనా సెంట్రల్ బ్యాంకు ఓ ప్రకటన భారతీయ కాలమాన ప్రకారం 4.40 గంటలకు విడుదల చేసింది.  క్రిప్టో కరెన్సీ సంబంధిత లావాదేవీలన్నీ చట్టవ్యతిరేకమైనవని చైనా కేంద్రీయ బ్యాంకు స్పష్టం చేసింది. 
ఈ కరెన్సీ మార్కెట్‌కు నష్టం కలిగిస్తుందని.. ఈ నేపథ్యంలోనే క్రిప్టో సంబంధిత లావాదేవీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశంలో బిట్‌కాయిన్ సహా క్రిప్టో కరెన్సీ మొత్తాన్ని నిషేధించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. 
పలుదేశాల్లో క్రిప్టో కరెన్సీతో లావాదేవీలకు అనుమతులు ఇస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలైన ఎలన్ మస్క్ వంటి వారు కూడా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలోనే పలు దేశాలు తమ దేశంలో క్రిప్టో ద్వారా చెల్లింపులు చేయడానికి కూడా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. కానీ చైనా మాత్రం ఈ విధానానికి వ్యతిరేకంగా ఉంది. చాలా సార్లు క్రిప్టో కరెన్సీపై నియంత్రణ విధిస్తూ వచ్చింది. క్రిప్టో కరెన్సీలను 2013లోనే చైనా బ్యాంకులు నిషేధించాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేసింది. క్రిప్టో కరెన్సీ మైనింగ్‌, ట్రేడింగ్‌ చేయడం ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా నష్టం కలిగిస్తుందని అందులో తెలిపింది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే బిట్‌ కాయిన్‌ ధర  5.5 శాతం పడిపోయింది.


crypto china ban bitcoin

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending