బైజుస్ ఖాతాలో మరో కంపెనీ.. అమెరికా రీడింగ్ కంపెనీతో డీల్

2021-07-21 22:09:53 By Y Kalyani

img

బైజుస్ ఖాతాలో మరో కంపెనీ.. అమెరికా రీడింగ్ కంపెనీతో డీల్

ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ ఇండియాస్ మోస్ట్ వాల్యూడ్ ఇంటర్నెట్ సంస్థ అయిన Byju’s అమెరికాకు చెందిన స్టార్టప్ ను సొంతం చేసుకుంది. వరుస టేకొవర్లతో దూసుకుపోతున్న బైజుస్ అమెరికాలోని ప్రముఖ సంస్థ EPIC ను సుమారు 500 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. అయితే ఇందులో క్యాష్ డీల్ ఎంత.. అన్నతి ఇరు కంపెనీలు ప్రకటించలేదు.
ప్రపంచంలోని 250 ఉత్తమ ప్రచురణకర్తల నుండి 40,000 పైగా ప్రసిద్ధ, మరియు క్వాలిటీ పుస్తకాల సేకరణతో ఎపిక్ ఏర్పాటు అయింది. తల్లిదండ్రులు తమ బిడ్డలు ప్రోగ్రస్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేవిధంగా ఎపిక్ పుస్తకాలుంటాయి. ఇది పిల్లలను ఆకర్షించే మంచి కథలను కూడా అందిస్తుంది. 
మిలియన్ల మంది విద్యార్ధులు నిరంతరం లెర్నింగ్ స్కిల్స్ అబ్బేలా చేయడంలో ఈ డీల్ ఉపయోగపడుతుందన్నారు. ఇంటరాక్టివ్ రీడింగ్ ద్వారా తరువాతి తరానికి స్ఫూర్తినిచ్చే ఎపిక్ మోడల్ లక్షలాది మంది పిల్లలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతుందన్నారు బైజుస్ సంస్థ ఛైర్మన్. అమెరికాలో బైజుస్ మొత్తం  1బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్టు కంపెనీ తెలిపింది. 2019లోనే అమెరికాకు చెందిన ఓస్మోను 120 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు వైట్ హ్యాట్ జూనియర్ సంస్థను కూడా బైజుస్ సొంతం చేసుకుంది. ఆన్ లైన్ ఎడ్యుకేషన్ రంగంలోతిరుగులేని స్థానంలో ఉన్న బైజుస్ గత ఏడాది దాదాపు 2 బిలియన్ డాలర్లు వెచ్చించింది. 


byjus company education