-->

పదేళ్ల తర్వాత రికార్డు బుల్ పరుగులు

2021-01-13 21:54:10

img

పదేళ్ల తర్వాత రికార్డు బుల్ పరుగులు
2010 రికార్డులు తిరగరాసే అవకాశం
సెంటిమెంట్ పరంగానూ సానుకూలమే..
మదుపుదారులకు కలిసొచ్చే అంశమేనంటున్న నిపుణులు


కోవిడ్ ఎఫెక్ట్ తో సంబంధం లేకుండా స్టాక్ మార్కెట్లు రికార్డు లాభాలు చూపాయి. పదేళ్ల గరిష్ట స్థాయిలో బలపడింది. మార్చి31తో ముగిసే 2020-2021 ఆర్థిక సంవత్సరం పదేళ్లలోనే హయ్యస్ట్ స్టాక్ మార్కెట్ గెయిన్ గా రికార్డు స్రుష్టించబోతుంది. ఇండియా బెంచ్ మార్క్ సూచీలు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే  65శాతం పెరిగింది. 2020లో నిఫ్టీ 26శాతంగానే ఉంది. మార్చిలో భారీగా కోవిడ్ లాక్ డౌన్ కారణంగా స్టాక్ మార్కెట్లు పతనం అయ్యాయి. దీంతో గడిచిన ఆర్ధిక సంవత్సరం 2019-2020లో కేవలం 26శాతం గెయిన్ అయ్యాయి సూచీలు. కానీ ఈ ఏడాది ఇప్పటికే 65శాతంగా ఉంది. 
2010లో మార్కెట్లు 73.76శాతం గెయిన్ అయ్యాయి. మళ్లీ గడిచిన తొమ్మిదేళ్లలో ఎప్పుడూ ఈ రేంజిలో  మార్కెట్లు పరుగులు తీయలేదు. 2010 తర్వాత 2020వరకు హయ్యస్ట్ గెయిన్ 2015లో 26.65శాతం. ఈ తర్వాత మళ్లీ ఇప్పుడే 65 శాతం దాటింది. ఇదే బుల్ రన్ నడిస్తే.. 2010 రికార్డు 73శాతం కూడా దాటే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. 
ఆర్దిక సంవత్సరం 2020-21లో ఇప్పటివరకూ దాదాపు 30 బిలియన్ డాలర్ల FIIలు వచ్చాయి. 2010లో ఇది కేవలం 7 బిలియన్ డాలర్లు మాత్రమే. 
మార్కెట్ల్లో ఈ ఏడాది స్మాల్ క్యాప్ 81శాతం, మిడ్ క్యాప్ 97శాతం గెయిన్ అయ్యాయి. ఇలాగే కొనసాగితే.. 2010లో మిడ్  క్యాప్ 130శాతం, స్మాల్ క్యాప్ 161శాతం రీచ్ అవుతున్నాయి. 
మార్కెట్లు బుల్ పరుగులకే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. కార్పొరేట్ ఎర్నింగ్స్ బలంగా ఉన్నాయి. అటు ఎకానమీ కూడా అనుకున్న దాని కంటే మెరుగ్గా ఉండటంతో పాటు గ్లోబల్ లిక్విడిటీ కూడా కలిసొస్తుంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్లు మార్కెట్లపై ద్రుష్టిపెడుతున్నారు. 
అసలే పరుగులు తీస్తున్న మార్కెట్లకు ఈ సెంటిమెంట్ కూడా కలిసివచ్చే అవకాశం ఉంది.