స్టాక్ మార్కెట్‌లో నడుచుకునే తరీఖా ఇదీ... మరోసారి పోర్ట్‌ఫోలియోను షఫుల్ చేసిన బిగ్‌బుల్.. 

2021-10-22 19:10:20 By VANI

img

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించడమైతేనేం.. పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీలు మార్చుకుంటూ పోవడం వంటివి అందరూ చేయలేరు. అలా చేయగలిగితే వారు ఐకాన్‌గా మారిపోతారు. స్టాక్ మార్కెట్‌లో ఉన్న అలాంటి అతికొద్ది మంది ఐకాన్స్‌లో రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా ఒకరు. ఎన్నో ఎత్తుపల్లాలనూ ఒడిదుడుకులను ఎదుర్కొన్న మీదట మార్కెట్‌పై కావల్సినంత పట్టు సాధించగలిగారు. ఎప్పటికప్పుడు స్ట్రాటజీలు మార్చుకుంటూ వెళుతుంటారు. 

 

ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ షేర్‌హోల్డర్స్‌లో ఆసక్తికరంగా బిగ్‌బుల్ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పేరు మరోసారి వినిపిస్తోంది. రాకేశ్ సతీమణి రేఖా ఝన్‌ఝన్‌వాలా సెప్టెంబర్ త్రైమాసికంలో ఫెడరల్ బ్యాంక్‌లోకి ప్రవేశించినట్లు తాజా షేర్‌హోల్డింగ్ డేటా సూచిస్తోంది. రేఖా ఝన్‌ఝన్‌వాలా సెప్టెంబర్ 30 నాటికి ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్‌లో 50,00,000 వాటాలు లేదా 1.1 శాతం వాటాను కలిగి ఉన్నారు. డిసెంబర్ 30 నాటికి రాకేశ్ ఈ కంపెనీలో వాటాను కలిగి ఉన్నారు.

 

ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్‌లో డిసెంబర్ క్వార్టర్‌లో ఆయన వాటా 1శాతానికి పెరగగా.. తిరిగి మార్చి 31 నాటికి అది 1 శాతం కంటే తక్కువకి తగ్గించుకున్నారు. దీంతో కంపెనీ షేర్‌హోల్డింగ్ ప్యాట్రన్‌లో ఆయన పేరు కనిపించలేదు. 1 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్న కంపెనీలు వాటాదారుల పేర్లను మాత్రమే తెలియజేయాలి కాబట్టి ఈ మధ్య రెండు త్రైమాసికాల్లో బిగ్ బుల్ స్టాక్‌ను కలిగి ఉన్నారా.. లేదా? అనేది నిర్దారించడం కష్టం. 

 

ఇక రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా సెప్టెంబర్ త్రైమాసికంలో ఫెడరల్ బ్యాంక్‌లో తన వాటాను 5,47,21,060 షేర్లలో స్థిరంగా ఉంచుకున్నారు. ఝన్‌ఝన్‌వాలా దంపతులు ఫెడరల్ బ్యాంకులో 2,10,00,000 షేర్లు లేదా 1.01 శాతం వాటాలు కొనుగోలు చేశారు. ఇక రేఖా.. మరో స్టాక్ టాటా కమ్యూనికేషన్స్‌లో తన వాటాను 1.04 శాతం నుంచి 1.08 శాతానికి పెంచేశారు. రాకేశ్ దంపతులకు జూన్ 30 నాటికి 4.81 శాతం వాటా ఉండగా.. అది సెప్టెంబర్ 30 నాటికి టైటాన్ కంపెనీలో 4.87 శాతానికి పెరిగింది. 

 

జూన్ త్రైమాసికంలో సెయిల్‌లోకి ప్రవేశించిన రాకేశ్ ప్రభుత్వ ఉక్కు కంపెనీలో తన వాటాను 1.39 శాతం నుంచి 1.76 శాతానికి పెంచేశారు. ఎస్‌కార్ట్స్, నజారా టెక్నాలజీస్, ఆటోలైన్ ఇండస్ట్రీస్, మ్యాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్, ఎన్‌సీసీ, ఓరియంట్ సిమెంట్, ప్రకాష్ ఇండస్ట్రీస్, బిల్‌కేర్, డిబి రియాల్టీ, జూబిలెంట్ ఫార్మోవా వంటి కంపెనీలలో ఝన్‌ఝన్‌వాలా తమ వాటాలను కాన్‌స్టెంట్‌గా ఉంచుకున్నారు.


Rakesh Jhunjhunwala  Rekha  Indiabulls Real Estate  Federal Bank 

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending