బ్యాంకులకు ముంచుకొస్తున్న NPA ప్రమాదం

2021-09-15 08:12:50 By Y Kalyani

img

బ్యాంకులకు ముంచుకొస్తున్న NPA ప్రమాదం 

బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకపోతున్నాయి. రిటైల్‌, MSME  విభాగాల నుంచి నిరర్థక ఆస్తులు ఎక్కువ అవుతున్నట్టు తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. 2022 మార్చి నాటికి NPAలు రూ.10 లక్షల కోట్లు దాటవచ్చునని అంచనా ఇండస్ట్రీ బాడీ అసోచామ్‌ అంటోంది రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తో కలిసి చేసిన సర్వే ఆందోళన కలిగించే అంశాలు వెల్లడించింది.
సాధారణంగా NPAల్లో పెద్ద పెద్ద కంపెనీలుంటాయి. కానీ ఇప్పుడు చిన్న సంస్థలు.. అటు రిటైల్ రుణాలు జాబితాలో ఉంటున్నాయట. ఎంఎస్‌ఎంఈ, చిన్న స్థాయి రుణాలు తీసుకున్నవారికోసం ప్రకటించిన పునర్‌వ్యవస్థీకరణ స్కీంతో నిరర్థక ఆస్తులు మరింత పెరిగాయి. కరోనా వైరస్‌తో బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థల గ్రాస్ NPAలు కూడా మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని సర్వే హెచ్చరించింది. మార్చి 2018లో గరిష్ఠ స్థాయిలో ఉన్న బ్యాంకుల జీఎన్‌పీఏ.. గత మార్చి నాటికి భారీగా తగ్గింది. ప్రభుత్వరంగ బ్యాంకులు రిస్క్‌ నుంచి బయటపడ్డాయని వెల్లడించింది. అయితే మళ్లీ ప్రమాదం ముంచుకొస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


banks npa GNPAs

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending