-->

రికార్డు స్థాయి గరిష్టానికి బ్యాంక్‌ నిఫ్టీ

2021-01-13 09:39:38

img

రికార్డు స్థాయి గరిష్టానికి బ్యాంక్‌ నిఫ్టీ

 

50వేల దిశగా సెన్సెక్స్‌

 

ఆల్‌టైమ్‌ గరిష్ట రికార్డును తిరగరాసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

 

వరుసగా నాల్గోరోజూ దేశీయ మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోంది. సెన్సెక్స్‌, నిఫ్టీలు ఆల్‌టైమ్‌ రికార్డులను ఇవాళ మళ్ళీ తిరగరాశాయి. ఇక బ్యాంక్‌ నిఫ్టీ కూడా ఇవాళ సరికొత్త గరిష్ట స్థాయి(32580)కి చేరి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇవాళ ఉదయం సెన్సెక్స్‌ 0.5 శాతం లాభఃతో 49763 వద్ద, నిఫ్టీ 0.5శాతం లాభంతో 14,639 వద్ద ఇవాళ ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 203 పాయింట్ల లాభంతో 49720 వద్ద ట్రేడవుతూ 50వేల దిశగా పయనిస్తోంది. నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 14632 వద్ద, బ్యాంక్‌ నిఫ్టీ 242 పాయింట్ల లాభంతో 32580 వద్ద కొనసాగుతోన్నాయి.


ఇవాళ్టి సెషన్‌లో అన్ని రంగాల సూచీలకు కొనుగోళ్ళ మద్దతు లభించింది. మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లు ఒకశాతం పైగా లాభంతో, బ్యాంక్‌ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ సూచీలు అరశాతం లాభంతో కొనసాగుతోన్నాయి. బోర్డర్‌ మార్కెట్స్‌ కూడా అరశాతం లాభంతో ట్రేడవుతోన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో 1241 స్టాక్స్‌ లాభాల్లో 348 స్టాక్స్‌ నష్టాల్లో కదలాడుతోన్నాయి.


భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 3.47శాతం, టాటా మోటార్స్‌ 2.92 శాతం, ఓఎన్‌జీసీ 2.71శాతం, అదాని పోర్ట్స్ 2.49 శాతం, ఎస్‌బీఐ 2.46 శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. టైటాన్‌ 0.97 శాతం, కోటక్‌ మహీంద్రా 0.84 శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 0.71శాతం, బ్రిటానియా 0.71శాతం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 0.83 శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.