బజాజ్ ఫైనాన్స్ ఊరించి ఉసూరుమనిపించింది

2021-07-21 22:44:10 By Y Kalyani

img

బజాజ్ ఫైనాన్స్ ఊరించి ఉసూరుమనిపించింది

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ బుధవారం జూన్ తో ముగిసిన త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. నెట్ ప్రాఫిట్ 31శాతం తగ్గి కేవలం రూ. 833 కోట్లకు పరిమితం అయింది. గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ.1215 కోట్లు ప్రాఫిట్ నివేదించింది. ఆదాయం కూడా 2020 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ. 14,192 కోట్లు నమోదు చేయగా... 2021 ఏప్రిల్-జూన్లో  కేవలం రూ.13,949 కోట్లు సాధించింది. ఈ ఆర్థిక ఫలితాలు మొత్తం బజాజ్ ఫైనాన్స్ గ్రూపుకంపెనీలతో కలిపినవే. ఇందులో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ అలియెన్స్ జనరల్, బజాజ్ అలియెన్స్ లైఫ్ కలిపి ఉన్నాయి.

బ్రేకప్ గా చూస్తే...
బజాజ్ ఫైనాన్స్ నెట్ ప్రాఫిట్ 4.2శాతం పెరిగి 1002 కోట్లు నమోదు చేసింది. బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ 8.4శాతం తగ్గి కేవలం రూ.362 కోట్లకు పరిమితం అయింది. అటు బజాజ్ అలియెన్స్ లైఫ్ కూడా 35.4శాతం నెట్ ప్రాఫిట్ తగ్గి.. రూ.84 కోట్లకు పరిమితమైంది. కంపెనీ బోర్డు కీలకం నిర్ణయం తీసుకుంది. బజాజ్ ఫైనాన్స్ డైరెక్టు లిమిటెడ్ లో రూ.342 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని తీర్మానం చేసింది. ఇది బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీకి ఫుల్లీ రాయితీ కంపెనీగా ఉంటుంది. 


bajaj bajaj fin q1 result