ఆటో సెక్టార్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన కేంద్రం

2021-09-24 22:27:34 By Y Kalyani

img

ఆటో సెక్టార్ కు  షాకింగ్ న్యూస్ చెప్పిన కేంద్రం

ఇప్పటికే ఆటో రంగానికి వరుస షాకులు తగులుగుతున్నాయి. ఇప్పటికే సెమీ కండక్టర్ చిప్ కొరతతో అమ్మకాలు తగ్గాయి. అటు విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తేనే రాయితీలు ఉంటాయని ప్రకటించిన కేంద్రం.. తాజాగా నెలరోజుల్లో సంచలన ఉత్తర్వులు చేయబోతున్నట్టు కేంద్ర మంత్రి నితన్ గడ్కరీ తెలిపారు. ఇక నుంచి కార్లు ప్లెక్సీ ఫ్యూయల్ ఇంజిన్లు అమర్చాలని.. మూడు నాలుగు నెలల్లో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా ఇస్తామని తెలిపారు. 
స్థానికంగా త‌యారుచేసిన ఇథ‌నాల్ వాడ‌కంతో పెట్రోల్‌-డీజిల్ వినియోగం నుంచి ఉప‌శ‌మ‌నం కల్పించేలా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. బీఎండ‌బ్ల్యూ, మెర్సిడెజ్ బెంజ్‌, టాటా, మ‌హీంద్రా కంపెనీలే కాదు.. బ‌జాజ్ ఆటో, టీవీఎస్ వంటి సంస్థలు కూడా కూడా ఫ్లెక్స్ ఫ్యూయ‌ల్ ఇంజిన్లు త‌యారు చేయాల్సి ఉంటుందన్నారు. అయితే పెద్ద కంపెనీలు మాత్రం తప్పనిసరి అంటున్నారు. 
కేంద్రమంత్రి ప్రకటనపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. కంపెనీలపై ఇది ఎంత భారం పడుతుంది.. ఎంత వరకూ వర్కువుట్ అవుతుంది... ప్లెక్సీ ఇంజిన్ విషయంలో ఎలాంటి సాధకబాధకాలు ఉండబోతున్నాయన్నది త్వరలో తేలనుంది. 


AUTO SECTOR INDEX TATA MAHINDRA

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending