కొత్త యాపిల్స్ వచ్చేశాయి... అదిరిపోయే ఫీచర్స్

2021-09-15 07:48:54 By Y Kalyani

img

కొత్త యాపిల్స్ వచ్చేశాయి... అదిరిపోయే ఫీచర్స్

టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఐఫోన్‌ 13 మోడల్స్‌ను విడుదల చేసింది. గతేడాది వచ్చిన ఐఫోన్‌ 12 మోడల్‌తో పోల్చితే 13లో కొద్దిపాటి మార్పులు చేశారు. కెమెరా సెన్సార్‌, మెరుగైన అల్ట్రావైడ్‌ కెమెరాల్ని అమర్చారు. ఐఫోన్‌ 13(6.1 అంగుళాలు), ఐఫోన్‌ 13 మిని (5.4 అంగుళాలు)ల్లో 128 జీబీ, 64 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లు ఉన్నాయి. ఐఫోన్‌ 13 ప్రొ(6.1 అంగుళాలు), ఐఫోన్‌ ప్రొ మ్యాక్స్‌(6.7 అంగుళాలు) 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్‌ 1TB వెర్షన్లతో విడుదలయ్యాయి. ఈ నెల 17 నుంచి బుకింగ్‌లు. 24 నుంచి మార్కెట్లోకి వస్తాయి. 

ఫీచర్లు…
పింక్‌, బ్రాంజ్‌, గ్రాఫైట్‌ గ్రేల్లో కొత్తగా వస్తున్నాయి.
50 శాతం ఫాస్ట్‌గా పనిచేస్తుంది.
అడ్వాన్స్‌డ్‌ డ్యూయల్‌ కెమెరా సిస్టమ్‌ ఏర్పాటు
బ్యాటరీలు పెద్దవి. ఇంటర్నల్‌ స్పేస్‌ సేవింగ్‌ డిజైన్‌ కారణంగా బరువు కూడా ఎక్కువే.
ఐఫోన్‌ 12తో పోలిస్తే బ్యాటరీ లైఫ్‌ 2.5 గంటలు ఎక్కువ.
6ఈ స్టాండర్డ్‌ వైఫై, 5జీ సర్వీసుల్ని సపోర్ట్‌ చేస్తుంది

ఇతర ఉత్పత్తులు కూడా...
థర్డ్‌ జనరేషన్‌ ఐపాడ్స్‌ను, కొత్త యాపిల్‌ వాచ్‌ 7 సిరీస్‌ను 5జీ ఎనేబుల్డ్‌ విడుదల చేశారు.

ఐప్యాడ్
ఐప్యాడ్‌ ప్రారంభ ధర: 360 డాలర్లు
ఐప్యాడ్‌ మినీ ప్రారంభ ధర: 499 డాలర్లు
డిస్‌ప్లే: 8.3 అంగుళాల లిక్విడ్‌ రెటినా డిస్‌ప్లే
ఫ్రంట్‌ కెమెరా: 12 మెగాపిక్సల్‌
బ్యాంక్‌ కెమెరా: 12 మెగాపిక్సల్‌
ఇతర ఫీచర్లు: స్మార్ట్‌ హెచ్‌డీఆర్‌, 4కే వీడియో రికార్డింగ్‌, వైఫై, సెల్యులార్‌ కన్ఫిగరేషన్స్‌, యూఎస్‌బీ-సీ పోర్ట్‌, 5జీ మోడెమ్‌, ల్యాండ్‌స్కేప్‌ మోడ్‌లో స్టీరియోతో సరికొత్త స్పీకర్‌ వ్యవస్థ

యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 7
ధర: 399 డాలర్లు
41ఎంఎం, 45ఎంఎం సైజుల్లో లభ్యం
బ్యాటరీ సామర్థ్యం: 18 గంటల వరకు
యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌పై చార్జింగ్‌
క్రాక్‌ రెసిస్టెంట్‌ టెక్నాలజీ

ఇండియాలో ధరలు ఇలా ఉండొచ్చు...
ఐ ఫోన్ 13 మినీ రూ.69,900
ఐ ఫోన్ 13 రూ.79,000
ఐఫోన్ 13 ప్రొ రూ.1,19,900
ఐఫోన్ 13 ప్రొ మాక్స్‌ రూ.1,29,900


apple iphone latest news iphone 13

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending