లాభాల మోత మోగించిన 3 కంపెనీలు.. సొమ్మంతా అక్కడే

2021-07-28 08:36:06 By Y Kalyani

img

లాభాల మోత మోగించిన 3 కంపెనీలు.. సొమ్మంతా అక్కడే

అమెరికాకు చెందిన మూడు కంపెనీలు ఆదాయంలో రికార్డులు స్రుష్టిస్తున్నాయి. తమకు తామే సాటి అని మళ్లీ నిరూపించుకున్నాయి. త్రైమాసికంలో Apple, Microsoft మరియు Google ఈ మూడు కంపెనీలు కలిపి ఏకంగా 50వేల బిలియన్ డాలర్లు నెట్ ప్రాఫిట్ సాధించాయి. కొవిడ్ కూడా ఆయా కంపెనీల ఆదాయాలకు బ్రేకులు వేయలేకపోయింది. పైగా ఇంకా పెరిగింది. కొవిడ్ 19 అవుట్ బ్రేక్ తర్వాత ఈ 16 నెలల్లో ఈ మూడు కంపెనీల మార్కెట్ వాల్యూ దాదాపు రెట్టింపు అయింది.  6.4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచంలో పవర్ ఫుల్ కంపెనీలుగా అవతరించాయి. ఈ మూడు కంపెనీల విలువ కలిపితే మన దేశ జీడీపీకి దాదాపు రెండున్నర రెట్లు. 

యాపిల్ కంపెనీ..
కంపెనీ ఐ ఫోన్ల అమ్మకాలు కొవిడ్ సీజన్ లో కూడా డబుల్ డిజిట్ గ్రోత్ చూపించింది. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో కంపెనీ నిపుణుల అంచనాలు సులభంగా అందుకుని భారీ లాభాలు ప్రకటించింది. కంపెనీ ఆదాయం అంతకుముందు ఏడాదితో పోల్చితే 36శాతం పెరిగి 81.4 బిలియన్ డాలర్లుగా చూపించింది. నెట్ ప్రాఫిట్ 21.7 బిలియన్ డాలర్లుగా ఉంది. కంపెనీ ఐఫోన్ అమ్మకాల ద్వారా 40 బిలియన్ డాలర్లు.. సర్వీస్ ద్వారా 17.5 బిలియన్ డాలర్లు ఆదాయం సాధించింది.

గూగుల్..
గూగుల్ కంపెనీ ఆల్ఫాబెట్  18.53 బిలియన్ డాలర్లు ఆదాయం ఆర్జించింది. గత ఏడాది ఇది కేవలం 6.9 బిలియన్ డాలర్లు మాత్రమే. గూగుల్ యాడ్స్ ఆదాయం 69శాతం పెరిగి 50.44 బిలియన్ డాలర్లకు చేరింది. మొత్తం ఆదాయం గతఏడాది కంటే 62శాతం పెరిగి 61.88 బిలియన్ డాలర్లు.

మైక్రోసాఫ్ట్...
ఈ కంపెనీ కూడా ప్రాఫిట్ 16.5 బిలియన్ డాలర్లుగా చూపించింది. గత ఏడాది కంటే ఇది 47శాతం అధికం. నెట్ ఇన్ కం పర్ షేర్ వచ్చేసి 2.17 డాలర్లుగా ఉంది. 


apple google microsoft shares profits

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending