అనీల్ అంబానీ కంపెనీలో మళ్లీ ఆశలు.. తగ్గుతున్న అప్పులు

2021-06-18 09:44:53 By Y Kalyani

img

అనీల్ అంబానీ కంపెనీలో మళ్లీ ఆశలు.. తగ్గుతున్న అప్పులు

రుణభారం తగ్గించే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్. కొంతమంది అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం పవర్ కంపెనీకి ఉన్న రుణాలు 79శాతం తగ్గించుకోవడానికి ప్రయత్నాల్లో ఉంది. ఈ ఏడాదిలో 1400 కోట్ల నుంచి 300 కోట్లకు రుణభారం అంటే 79శాతం తగ్గించడానికి నిర్ణయం తీసుకుంది. 
కంపెనీ ఇన్వెస్టర్లతో పాటు.. తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు ఇచ్చేవారి వేటలో ఉంది. ఇన్వెస్టర్లు అప్పును టేకొవర్ చేసి వాటాల తీసుకునేందుకు వచ్చినా సరే.. లేదంటే రుణాలు తక్కువ వడ్డీ రేటుతో రీషెడ్యూల్ చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తోంది. కంపెనీ తనకున్న విండ్ పవర్ కేంద్రాన్ని కూడా విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని సింగ్లీలో 45 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ఉంది. దీని అమ్మకం ద్వారా 200 కోట్లు సమకూరతాయని అంచనా. రిలయన్స్ ఇన్ ఫ్రా కంపెనీ గత కొంతకాలం రుణభారం తగ్గించుకునేప్రయత్నాల్లో ఉంది. కొద్ది నెలల్లోనే దాదాపు 15శాతం వరకూ తగ్గించింది. మార్చి చివరి నాటికి కంపెనీ అప్పులు రూ.24 214 కోట్లు కాగా.. ప్రస్తుతం ఇది రూ.20,625 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ రూ.3200 కోట్లు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ప్రమోటర్ల వాటా సంస్థ తన పేరెంట్ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రిఫరెన్షియల్ షేర్లు, వారెంట్లు జారీ చేయడం ద్వారా రూ.1,325 కోట్లు సమీకరించింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇతర ప్రమోటర్ల సంయుక్త వాటా తొమ్మిది శాతం నుండి 38 శాతానికి పెరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాన్ని తిరిగి చెల్లించడం ద్వారా మొత్తం వడ్డీ వ్యయం 3,000 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో కంపెనీ వడ్డీ రూపంలో 620 కోట్ల రూపాయలు చెల్లించింది. గత ఏడాది ఇదే కాలానికి 759 కోట్ల రూపాయలుగా ఉంది. రుణ తగ్గింపు డ్రైవ్ సరైన దిశలో ఉందని అంటున్నారు విశ్లేషకులు. బొగ్గు, గ్యాస్, హైడ్రో మరియు పునరుత్పాదక శక్తి ఆధారంగా కంపెనీ మొత్తం 5,945 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది.


rpower rilenace anil ambani amabni compnay