ఈ స్టాక్ ఓ చూపు చూడొచ్చా.. రైట్ Ritesఅంటున్న ఎనలిస్టులు

2021-06-10 22:34:08 By Y Kalyani

img

ఈ స్టాక్ ఓ చూపు చూడొచ్చా..  రైట్.. Rites అంటున్న ఎనలిస్టులు

2021లో మార్కెట్లో స్మార్ట్ ర్యాలీ కనిపిస్తోంది. షార్ప్ జంప్ లేదు.. బేర్ మనడం లేదు. నిలకడగా సూచీలు కదలాడుతున్నాయి. అయితే కొద్దకాలంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మాత్రం ఇన్వెస్టర్లకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. కరెక్షన్ వచ్చినా కూడా స్ట్రాంగ్ మిడ్ లేదా స్మాల్ పోర్ట్ ఫోలియో అయితే డోకా లేదంటున్నారు. కొన్ని స్టాక్స్ గురించి ఇన్వెస్టర్లు రికమండ్ చేస్తున్నారు. ఇందులో RITES ఒకటి. 

ఆల్ టైం గరిష్టానికి వస్తుందా?
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక సర్వీస్ సంస్థ RITES ప్రజంట్ అయితే మార్కెట్లో ఫ్లాట్ గా ట్రేడ్ అవుతోంది. మార్కెట్ తో పాటే గెయిన్ అవుతుంది. మే8 తర్వాత ఇది 12శాతం వరకూ గెయిన్ అయింది. ఇదే సమయానికి నిఫ్టీ 6శాతం లాభపడింది. ఈ నేపథ్యంలో అందరి చూపూ కూడా RITESపై పడింది. గురువారం మార్కెట్లో ఈ స్టాక్ రూ.274.30 వద్ద ముగిసింది. నెల రోజుల్లో ఇది 13శాతం పెరిగింది. అయితే ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. గతంలో ఇది  2020 జనవరి 17న రూ.320 వద్ద ట్రేడ్ అయింది. అంతేకాదు... రూ.420 కూడా రీచ్ కావొచ్చని టార్గెట్ ఇస్తున్నారు.
గత కొంతకాలంగా రైల్వేకు చెందిన కంపెనీల స్టాక్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నాయి. రైట్స్ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది.  
రానున్న 6 నుంచి 12 నెలల్లో స్టాక్ రూ.331 నుంచి 420 వరకు పెరుగుతుందని అంటున్నారు. సో ఇన్వెస్టర్లు దీనిపై ఓ కన్నేయండి. అయితే ఇది కేవలం నిపుణుల రికమండేషన్ మాత్రమే.. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ దీనికి బాధ్యత వహించదు.


market stocks dalalstreet bse nse it shares profit trade

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending