చరిత్ర స్రుష్టించిన అదానీ.. నీరుగారని అంబానీ

2021-11-24 23:23:17 By Y Kalyani

img

చరిత్ర స్రుష్టించిన అదానీ.. నీరుగారని అంబానీ

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజురానే వచ్చింది. ఎంతోకాలంగా కలగంటున్న గౌతమ్ అదానీ తన కలను నిజం చేసుకున్నారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ స్థానంలో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. 2015 నుంచి ప్ర‌తి ఏడాది ఇండియాలో అత్యంత సంపన్నుడిగా ప్ర‌థ‌మ‌స్థానంలోనే ఉన్న అంబానీ రెండోస్థానంలోని పడిపోయారు. 
ఏప్రిల్ 2020 నుండి అదానీ నికర విలువ బాగా పెరిగింది. కేవలం 20 నెలల్లో గౌతమ్ అదానీ 1808 శాతం పెరిగింది. 83.89 బిలియన్ డాలర్లుపైగా సంపద పెంచుకున్నారు. అదే సమయంలో ముఖేష్ అంబానీ నికర విలువ 250 శాతం 54.7 బిలియన్ డాలర్లు మాత్రమే పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో అదానీ ప్రస్తుత నికర విలువ 88.8 బిలియన్ డాలర్లుగా ఉంది. 
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, మంగళవారం అదానీ సంపద 88.8 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు అంబానీ నికర సంపద 91 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ బుధవారంతో బిలియనీర్ల జాతకాలు మారిపోయాయి. ఆరామ్‌కోతో డీల్‌ బ్రేక్‌ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1.77% పడిపోయాయి. అయితే అదానీ షేర్లు 2.34% జంప్ చేయడంతో అదానీ ఆస్తులు పెరిగి అంబానీ ఆస్తులు తగ్గుముఖం పట్టాయి. ఆరామ్‌కోతో డీల్ బ్రేక్ తర్వాత రిలయన్స్ షేర్లు రోజురోజు క్షీణిస్తున్నాయి. దీంతో అదానీ పైచేయి సాధించారు. 


ambani adani shares stake rich list

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending