నిజమైతే ఇది బ్యాడ్ న్యూసే.. ఏపీ నుంచి తమిళనాడు బడా కంపెనీ

2021-08-02 22:56:16 By Y Kalyani

img

నిజమైతే ఇది బ్యాడ్ న్యూసే.. ఏపీ నుంచి తమిళనాడు బడా కంపెనీ

ప్రముఖ కంపెనీ అమరరాజా బ్యాటరీస్ ఏపీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. తమ ప్లాంట్ చెన్నైలో పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇటీవల గ్రూప్ ఛైర్మన్ గా గల్లా జయదేవ్ నియమింపబడ్డారు. తండ్రి రాజగోపాలనాయుడు వయసు రిత్యా బాధ్యతల నుంచి తప్పుకోవడంతో వారసుడిగా గల్ల జయదేవ్ పగ్గాలు చేపట్టారు. ఆయన టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల కంపెనీకి ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. కాలుష్యం పెరుగుతుందని.. దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని వెంటనే ప్లాంట్ ఆపేయాలని ఆదేశించింది. దీంతో కొద్దిరోజుల పాటు కంపెనీ ఉత్పత్తి ఆగిపోయింది. తర్వాత కోర్టుకు వెళ్లి మళ్లీ స్టే తెచ్చుకున్నారు. రాజకీయంగా టార్గెట్ చేశారని భావిస్తున్న గల్లా జయదేవ్ కంపెనీని ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేయాలని భావించారట. రాజకీయంగా ఉండటంతో సొంత వ్యాపారాల్లో ఇబ్బందులు తప్పవని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. కంపెనీకి సంబంధించి తలెత్తే సమస్యల కారణంగా షేర్ మార్కెట్లో లిస్ట్ కంపెనీ కావడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం తగ్గుతుంది. అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మంచి పేరున్న సంస్థ ను కాపాడుకునేందుకు తరలివెళ్లడం తప్పదని చెబుతున్నారు. 

తమిళనాడుతో చర్చలు...

తమిళనాడు సీఎం స్టాలిన్‌తో అమరరాజా యాజమాన్యం చర్చలు జరిపిందట. అమరరాజాకు సీఎం స్టాలిన్ రెడ్ కార్పెట్ పరిచినట్టు చెబుతున్నారు. ఇప్పటికే స్థలం  కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. కేటాయించిన స్థలంలో ముమ్మరంగా పనులు సాగుతున్నాయట. 3 నెలల్లో చిత్తూరు నుంచి తమిళనాడుకి అమరరాజా తరలివెళ్లనున్నట్లు సమాచారం. బ్యాటరీ సెక్టార్‌లో దేశంలోనే అమరరాజా 2వ అతిపెద్ద సంస్థ. సుమారు 8వేల బిలియన్ డాలర్ల టర్నోవర్ ఉంది. కంపెనీ ప్రతి సంవత్సరం రూ.2400 కోట్ల పన్నులు చెల్లిస్తోంది. అమరరాజా చెల్లించే పన్నులలో ఏపీ వాటా రూ.1200 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తోంది. వాస్తవానికి కంపెనీ విద్యుత్ వాహనాలకు అవసరమైన బ్యాటరీలు ఉత్పత్తిపై ఫోకస్ చేసింది. భారీగా విస్తరణ ప్రణాళికులు వేసింది. ఇక్కడే ముందుగా విస్తరించాలని భావించినా కూడా ఇక్కడ నెలకొన్న పరిస్థితుల ద్రుష్ట్యా తమిళనాడుకు వెళ్లాల్సిన నిర్ణయించారు. 


amararaja stock market trading ap tamilanadu

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending