వొడాఫోన్ ఐడియాను ఆదుకోవడానికి ఫ్రెష్ ఇన్వెస్టిమెంట్

2021-10-13 22:18:52 By Y Kalyani

img

వొడాఫోన్ ఐడియాను ఆదుకోవడానికి ఫ్రెష్ ఇన్వెస్టిమెంట్

ఆర్ధికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా కంపెనీలో ఫ్రెష్ ఇన్విస్టిమెంట్ పెట్టాలని నిర్ణయించాయి సంస్థలు. వొడాఫోన్, అటు ఆదిత్యా బిర్లా గ్రూప్ కలిసి సంయుక్తంగా 400 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నాయి. కంపెనీలో వొడాఫోన్ సంస్థకు 44.39శాతం, అటు ఆదిత్యా బిర్లా గ్రూపునకు 27.66శాతం స్టేక్స్ ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్ నుంచి రూ.25వేల కోట్లు సమీకరించాలని 2021 సెప్టెంబరులో బోర్డు తీర్మానం చేసింది. కుమార మంగళం బిర్లా ఇందులో అన్ లిస్టెడ్ కంపెనీ ప్రమోటర్ హోదాలో పెట్టుబడి పెడతారని తెలుస్తోంది. తాజాగా పెట్టనున్న మనీని రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు.. మరియు సరికొత్త స్ట్రాటజీలకు వినియోగిస్తారు. అటు 4జీ నుంచి 5జీ దిశగా విస్తరణపై ఫోకస్ పెట్టారు. 
సెప్టెంబరులో కేంద్రం రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో ఫ్రెష్ ఇన్వెస్టిమెంట్ తో అప్పుల్లో కూరుకుపోయిన సంస్థకు ప్రాణం పోస్తున్నారు. 


idea vodaone abg news

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending