సంచలన నిర్ణయం తీసుకున్న అదానీ గ్రూప్

2022-01-14 22:11:57 By Y Kalyani

img

సంచలన నిర్ణయం తీసుకున్న అదానీ గ్రూప్

అదానీ గ్రూపునకు చెందిన సంస్థ ఒకటి సంచలన నిర్ణయం తీసుకుంది. లిస్టింగ్ కు రేపోమాపో వస్తున్న అనుబంధ కంపెనీ చివరి నిమిషంలో మార్పులు చేసింది. ఎడిబుల్ ఆయిల్ సహా కమాడిటీ ఉత్పత్తులను విక్రయిస్తున్న అదానీ విల్మార్ లిమిటెడ్ (AWL) తన IPO పరిమాణాన్ని తగ్గిస్తూ నిర్ణయించింది.  ముందుగా అనుకున్న రూ. 4,500 కోట్ల నుండి రూ. 3,600 కోట్లకు IPOకు వస్తోంది. ఫార్చ్యూన్ బ్రాండ్‌తో వంట నూనెలను విక్రయిస్తున్న కంపెనీ ఈ నెలలో ఐపీఓ రానుంది. AWL అనేది అహ్మదాబాద్‌కు చెందిన అదానీ గ్రూప్ మరియు సింగపూర్‌కు చెందిన విల్మార్ గ్రూప్ జాయింట్ వెంచర్. ఇరు కంపెనీలకు 50:50 వాటాలున్నాయి. 

పక్కా లెక్కతో వస్తోంది...
IPO రూ. 3,600 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూని కలిగి ఉంటుంది. ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయంలో రూ.1,900 కోట్లను మూలధన వ్యయానికి, రూ.1,100 కోట్లు అప్పుల చెల్లింపులకు వినియోగిస్తుంది. రూ.500 కోట్లను వ్యూహాత్మక కొనుగోళ్లు, పెట్టుబడులకు వినియోగిస్తారు.  కంపెనీ రూ. 1,100 కోట్ల దీర్ఘకాలిక రుణాన్ని తిరిగి చెల్లించడంతోపాటు వడ్డీ వ్యయంపై ఆదా చేస్తుంది. మూలధన వ్యయం కోసం అప్పులు చేయకుండా సొంతంగా ఈక్విటీ ద్వారా నిధులు సమకూరుస్తుంది కాబట్టి కంపెనీ అధిక లిక్విడిటీ మెరుగ్గా ఉంటుంది. రూ. 37,195 కోట్ల ఆదాయంతో భారతదేశంలోని ప్రముఖ ఫుడ్ ఎఫ్‌ఎంసిజి కంపెనీలలో అగ్రగామిగా ఉన్న AWL ఫుడ్స్ రంగంలో వేగంగా విస్తరించాలని ప్రయత్నాల్లో ఉంది. 

ప్రస్తుతం, ఆరు అదానీ గ్రూప్ కంపెనీలు దేశీయ మార్కెట్లలో లిస్టయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, మరియు అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్నాయి. ఇది ఏడో కంపెనీగా అవతరిస్తుంది. 


adani wilmar fortune ipo