పెరుగుట విరుగట కొరకే.. అదానీకి తెలిసివచ్చిందా

2021-06-17 23:08:13 By Y Kalyani

img

పెరుగుట విరుగట కొరకే.. అదానీకి తెలిసివచ్చిందా

ఎంత స్పీడుగా ఎదిగాడో.. అంతే వేగంగా పడిపోతున్నాడు గౌతమ్ అదానీ. కాలం కలిసొస్తే అంతా మనదిక్కే.. తేడా చేతిలో కర్ర కూడా ఎదురొస్తుంది. 58 ఏళ్ల సంచలన బిజనెస్ టైకూన్ అదానీకి ఇది తెలిసివచ్చినట్టుంది. కొద్ది వారాల్లోనే ఏసియా రిచెస్ట్ పర్సన్ గా ఎదిగిన అదానీకి.. అంతకంటే రెట్టింపు వేగంతో సంపద కరిగిపోతోంది. అంబానీకి దగ్గరగా వచ్చాడు.. ఇక దాటడమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఒక్క వార్త ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. సంపద కరిగించేసింది. వాస్తవానికి గత ఏడాది ప్రపంచంలో అత్యంత వేగంగా సంపద పోగేసుకున్న వ్యక్తిగా చరిత్ర స్రుష్టించాడు. ఇప్పుడు అంతే వేగంగా ఎవరికీ సాధ్యం కానంత స్పీడుగా తగ్గుతున్న వ్యాపారవేత్తగా కూడా మారాడు. ఆయన వ్యక్తిగత సంపద కేవలం మూడు రోజుల్లో 9 బిలియన్ డాలర్లు ఆవిరైంది. 77బిలియన్ డాలర్ల నుంచి 67బిలియన్ డాలర్లకు వచ్చినట్టు బ్లూమ్ బర్గ్ కంపెనీ వెల్లడించింది. 
మారిషిస్ కు చెందిన Albula Investment Fund, Cresta Fund మరియు APMS Investment Fund కంపెనీలు కలిపి అదానీ గ్రూపులో 6 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయని వాటికి అడ్రస్ కూడా లేదని వార్తలు రావడంతో పతనం మొదలైంది. ఈ కంపెనీల ఖాతాలు ఫ్రీజ్ చేసినట్టు వార్త వచ్చింది. అయితే ఫ్రీజ్ కాలేదని అదానీ గ్రూపు ప్రకటించింది. కానీ.. ఈ కంపెనీల ఓనర్లు ఎవరు.. ఎవరి కంపెనీలన్నది చెప్పలేదు. దీంతో అదానీ గ్రూపును ఎవరూ విశ్వసించడం లేదు. తమ కంపెనీలో పదేళ్లుగా పెట్టుబడి పెడుతున్నారని చెబుతున్న సంస్థ.. వాళ్ల వివరాలు అంతకుమించి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ఇది అదానీ గ్రూపునకు సవాలుగానే మారింది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. ఇందులో దేశానికి చెందిన ప్రముఖుల డబ్బు కూడా హవాలా రూపంలో వచ్చిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయని అంటున్నారు. ఒకప్పుడు హర్షద్ మెహతా స్కామ్ ను బయటపెట్టిన సుచిత్రా దలాల్ కూడా అదానీ గ్రూపులోని వ్యవహారాలను స్కామ్ త్వరలోనే బయటకు వస్తుందంటూ చేసిన ఈ మొత్తం వ్యవహారాన్ని మలుపులు తిప్పుతోంది.  


adani ports adaniports tekeover apsez profit tradings green energy adani gas