లాంగ్ టర్మ్ లక్ష్యాలు అయితే ఈ షేర్లు బెటరట

2021-12-04 09:28:01 By Y Kalyani

img

లాంగ్ టర్మ్ లక్ష్యాలు అయితే ఈ షేర్లు బెటరట
రెలిగేర్ బ్రోకింగ్ ఛాయిస్ స్టాక్స్
గడిచిన ఐదేళ్లలో లాభాలు అదరగొట్టాయి

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. కోవిడ్-19 మహమ్మారి మళ్లీ ఒమిక్రాన్ రూపంలో భయపెడుతోంది. అనిశ్చితి ఉన్నప్పటికీ కూడా కొన్ని స్టాక్‌లు మంచి లాభాలు ఇచ్చాయి. ఇక ముందు కూడా హెల్తీ రిటర్న్స్ ఇస్తాయంటున్నారు. గత 5 సంవత్సరాలలో కొన్ని స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. ఇక రుణ రహిత కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే రానున్న ఐదేళ్లలో ఇంకా మంచి ప్రాఫిట్ గ్యారెంటీ అంటోంది రెలిగేర్ బ్రోకింగ్ సంస్థ. దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంలో కొన్ని స్టాక్స్ ను రిఫర్ చేస్తోంది. 


దివీస్ లాబొరేటరీస్
NSE లిస్టెడ్ ఫార్మా స్టాక్ గత 5 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించింది. నిఫ్టీ దాదాపు 107 శాతం పెరగ్గా Divi's షేర్ ధర రూ.1160 నుండి రూ.4,751 వరకూపెరిగింది. అంటే 309 శాతం పెరుగుదలను నమోదు చేసింది. జీరో డెట్ కంపెనీ గత 5 సంవత్సరాలలో NSE నిఫ్టీ కంటే దాదాపు 200 శాతం ఎక్కువ రాబడిని అందించింది. రానున్న ఐదేళ్లకు మంచి ప్రాఫిట్ రావొచ్చని అంటున్నారు. 

ఇన్ఫోసిస్
గత ఐదేళ్లలో, ఈ IT స్టాక్ రూ. 495 నుండి రూ.1,738 వరకు పెరిగింది. దాదాపు 251 శాతం గెయిన్ అయింది. IT కంపెనీ కూడా గత 5 సంవత్సరాలలో జీరో డెట్ కంపెనీగా ఉంది. 50-స్టాక్ ఇండెక్స్ నిఫ్టీ ఇచ్చిన రాబడి కంటే దాదాపు 144 శాతం అధిక రాబడిని ఆర్జించింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS
జీరో డెట్ మరియు హై ఆల్ఫా ఫీచర్‌తో ఉన్న మరొక లార్జ్ క్యాప్ IT కంపెనీ స్టాక్. గత 5 సంవత్సరాలలో, TCS షేరు ధర NSEలో దాదాపు రూ.1100 నుండి రూ.3641కి పెరిగింది. వాటాదారులకు దాదాపు 231 శాతం రాబడిని అందించింది. 

ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ లేదా IGL
ఈ ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్ గత 5 సంవత్సరాలలో ఒక్కో షేరు స్థాయికి రూ.173.69 నుండి రూ.505.50కి పెరిగింది. ఇన్వెస్టర్లకు 191 శాతం రాబడిని అందించింది. 

హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ లేదా HUL
కన్జూమర్  కంపెనీ గత 5 సంవత్సరాలలో  రూ.817 నుండి రూ.2348.50 స్థాయికి చేరుకుంది. 178 శాతం రాబడిని ఇచ్చింది. 


market stocks invest trading multibaggers