2022లో స్టాక్ మార్కెట్ ముందు సవాళ్లు

2021-12-06 11:48:11 By Y Kalyani

img

2022లో స్టాక్ మార్కెట్ ముందు సవాళ్లు
భారీ లాభాలు ఆశించవచ్చా
ప్రాఫిట్ యువర్ ట్రేడ్ స్పెషల్
 

2021  చివరి నెల డిసెంబరులోకి ఎంటర్ అయ్యాం. 2022స్వాగతం పలికే సమయం వస్తోంది. ఒక్కసారి స్టాక్ మార్కెట్ గత ఏడాది రివ్యూ చేసుకోవడంతో పాటు.. వచ్చే ఏడాదిపై ఓ అంచనాకు రావడానికి ఇదే సమయం అంటున్నారు మార్కెట్ నిపుణులు. 

ఇన్వెస్టర్లకు కలిసొచ్చిన 2021
కోవిడ్ స్రుష్టించిన విలయం నుంచి ఆర్ధిక వ్యవస్థగాడిలో పడుతోంది. కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఎండమిక్ దశకు చేరుకుంటున్నాం. దశల వారీగా మొత్తం అన్ లాక్ అయింది. పెద్దగాప్రభావం పడకుండానే స్టాక్ మార్కెట్ భారీ లాభాలు చవిచూసింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు 30వరకు చూస్తే నిఫ్టీ ఇండెక్స్ 21.47శాతం గెయిన్ అయింది. కొత్త కొత్త కంపెనీ మార్కెట్లోకి వచ్చి భారీగా నిధులు సమీకరించాయి. 2020లో 16 కంపెనీలు మాత్రమే IPOకు వచ్చి రూ.26,600 కోట్లు సమీకరిస్తే... 2021లో ఏకంగా నవంబరు 30 వరకు 54 సంస్థలు వచ్చాయి. సుమారు రూ. 1.11 లక్షల కోట్లు సమీకరించాయి. మార్కెట్లో అన్ని సెక్టార్ల స్టాక్స్ కూడా భారీగా లాభపడ్డాయి. కొన్ని షేర్లు రెండు మూడు రెట్లు పెరిగాయి. 

కొత్త ఏడాదిలో సవాళ్లు..
2021లో పెరిగిన మార్కెట్ కు 2022 ఛాలెంజ్ గా మారబోతుంది. వాస్తవానికి చాలా కంపెనీలు పనితీరుతో సంబంధం లేకుండానే హై వాల్యూయేషన్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గడిచిన 18 నెలలుగా భారీగా లాభపడ్డాయి. ఇక మీదట ఇది మారే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కంపెనీ వ్యాపారం, లాభదాయకత, నాయకత్వం వంటి ఫండమెంటల్స్ చూసి పోర్ట్ ఫోలియో సరిచూసుకోవాల్సిన సమయం వచ్చిందన్నది నిపుణుల అభిప్రాయం. వాల్యేషన్ చూసి మరీ ఇన్వెస్ట్ చేయడం లేదా హోల్డ్ చేయడం కీలకం. ఇన్వెస్టర్లు 2021 తరహా బుల్లిష్ 2022లోనూ ఆశించవద్దని అలర్ట్ చేస్తున్నారు. మోడరేట్ గా లాభాలు వచ్చే అవకాశం ఉందట. అది కూడా కంపెనీ అవుట్ లుక్ చూసి క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తేనే. ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉన్నా RBI రెపోరేట్లు పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం ముంచుకొస్తోంది. సొ కాన్షియస్ ఇన్వెస్టిమెంట్ బెటర్.

ఛాన్స్  ఎక్కడుంది...

పెట్టుబడిదారులు అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ఫోకస్ చేయడం బెటర్. గడిచిన 18 నెలలుగా వచ్చిన ర్యాలీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ తీసుకుని డైవర్శిఫై చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుందన్నది నిపుణుల సలహా. REITs, Invits కూడా వచ్చే ఏడాది ఆకర్షినీయంగా ఉండవచ్చు. అంతర్జాతీయ కంపెనీలు ఈ రంగంలో భారీ పెట్టుబడులతో వస్తున్నాయి. దీనిపై ఫోకస్ చేయడం బెటర్ అని మార్కెట్ వర్గాలు అంటన్నాయి. మొత్తానికి ఇన్వెస్టర్లకు 2021తో పోల్చితే 2022కూడా కలిసివస్తుందా అన్నది చూడాలి. అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. అదే జోష్ కంటిన్యూ అవకాశాలు తక్కువ. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే అనిశ్చితి సంకేతాలు కనిపిస్తున్నాయి. 


market share bse nifty bull bear