రానున్న కొద్ది వారాల కోసం ఈ స్టాక్స్ ట్రై చేయమంటున్న ఏజెన్సీలు

2021-04-08 10:25:07 By Y Kalyani

img

రానున్న కొద్ది వారాల కోసం ఈ స్టాక్స్ ట్రై చేయమంటున్న ఏజెన్సీలు

కోవిడ్ -19 కేసులు వేగంగా పెరగడం వల్ల మార్కెట్లో అస్థిరత ఉంది. అయితే గత అనుభవాల నేపథ్యంలో దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. అయితే రాబోయే కొద్ది వారాల్లో పెట్టుబడిదారులకు మంచి ప్రాఫిట్ కోసం ఎనలిస్టులు.. బ్రోకరేజి సంస్థలు సూచించిన స్టాక్స్ గురించి ఓసారి చూద్దాం..

UPL
టార్గెట్ ధర: రూ  టార్గెట్ ధర: రూ .710
. ఈ స్టాక్ పాజిటివ్ సంకేతాలు ఇస్తోంది. 200 డేస్ సగటు కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతోంది. 575 రూపాయల వద్ద స్టాప్ లాస్‌తో సిఫార్సు చేస్తున్నారు.

Laurus Labs
టార్గెట్ ధర: 470 రూపాయలు. ప్రస్తుత ధోరణిని కొనసాగించే అవకాశం ఉందని సూచిస్తుంది. 470 రూపాయలు మరియు తరువాత 6-8 వారాల్లో 520 రూపాయలు వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. రూ .385-385 వద్ద గట్టి రెసిస్టెంట్ వచ్చే అవకాశం ఉంది. 345 వద్ద స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయండి.

Gujarat Pipavav Port
టార్గెట్ ధర: రూ .140. రాబోయే 6-8 వారాల్లో ఈ ధర రూ .125 కు, ఆపై రూ .140 కు చేరుకుంటుంది. స్టాప్ లాస్ 90 రూపాయల వద్ద పెట్టుకోవాలి. 

TCS 
టార్గెట్ ధర రూ .3,440 టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పెద్ద క్యాప్ ఐటి స్టాక్స్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రూ .3,090 వద్ద స్టాప్ లాస్ సిఫార్సు చేయబడింది.

Bharti Airtel
టార్గెట్ ధర: 585 రూపాయలు. 535 స్థాయిలో రెసిస్టెంట్ వచ్చి పైక ఏకబాకుతోంది. రాబోయే 3-4 వారాల్లో రూ .585 టార్గెట్‌తో కొనచ్చు. రూ.498 వద్ద స్టాప్ లాస్‌తో చూడండి. 

Power Finance Corporation
టార్గెట్ ధర: రూ .127.  వీక్లీ చార్టులలో సూచించినట్లుగా, పిఎస్‌యు స్టాక్ తిరోగమనం అయిపోయింది. మళ్లీ పైకిలేచే అవకాశం ఉంది. కీలకమద్దతు 110 రూపాయలకు మించి వచ్చే అవకాశం ఉంది. రాబోయే 3-4 వారాల్లో రూ .127 లక్ష్యంగా పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ రూ .106

Coforge
టార్గెట్ ధర: రూ .3,450 ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకిన తరువాత, స్టాక్ మూమెంట్ పందుకుంది. రూ .3,450 టార్గెట్ ధర కోసం కొనుగోలు సిఫార్సు చేయబడింది. స్టాప్ లాస్‌ రూ .2,700.

Divi's Laboratories
టార్గెట్ ధర: రూ .4,130  స్టాప్ లాస్ 3270 వద్ద పెట్టుకోవచ్చు.
 

పైన మీకు చెప్పిన టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అన్నీ కూడా వివిధ బ్రోకరేజి సంస్థలు చెప్పిన అంచనాలు రికమెండేషన్స్ మాత్రమే. https://www.profityourtrade.in/ నిపుణులు కానీ... టీవీ5 మనీ ఎనలిస్టుల సలహాలు కాదు.. మీరు చేసేలావాదేవీలకు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు. మీరు ట్రేడింగ్ సమయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending