కేవలం ఒక్క నెలలోనే 103 శాతం పెరిగిన డాలీఖన్నా పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్

2021-08-02 12:58:34 By VANI

img

డాలీ ఖన్నా పోర్ట్‌ఫోలియోలోని దీపక్ స్పిన్నర్స్, నితిన్ స్పిన్నర్స్ అనే రెండు వస్త్ర కంపెనీల మార్కెట్ ధర గత నెలలో అద్భుతమైన ఆదాయం గడిస్తాయన్న అంచనాతో కేవలం ఒక్క నెలలోనే 103 శాతం వరకు పెరిగింది. ఈ రెండు స్టాక్‌లు బీఎస్ఈలో రికార్డు స్థాయిలో జూమ్ అవుతున్నాయి. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్ గత ఒక నెలలో 0.80 శాతం లాభపడింది. జూన్ 30, 2021 నాటికి దీపక్ స్పిన్నర్స్‌లో డాలీ ఖన్నా 2.07 శాతం వాటాను కలిగి ఉండగా.. నితిన్ స్పిన్నర్స్‌లో 1.24 శాతం వాటాను కలిగి ఉంది. 

 

వ్యక్తిగత స్టాక్ విషయానికి వస్తే.. సోమవారం ఇంట్రా డే ట్రేడ్‌లో దీపక్ స్పిన్నర్స్ 10 శాతం పెరిగి.. రూ.421.70కి చేరింది. గడిచిన నెలల రోజులలో 103 శాతం పెరిగింది. జూన్ 24, 2021 నాటికి డాలీ ఖన్నాబహిరంగ మార్కెట్ ద్వారా రూ .1.28 కోట్ల విలువైన దీపక్ స్పిన్నర్లలో 1.06 శాతం వాటాను సూచిస్తూ అదనంగా 76,555 షేర్లను కొనుగోలు చేశారు. అలాగే బీఎస్ఈలో బల్క్ డీల్ ద్వారా రూ.167.21 శాతం ధర వద్ద షేర్లను కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజ్ డేటా చూపిస్తోంది. 


Dolly khanna  Deepak Spinners  Nitin Spinners

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending