దుమ్మురేపిన సెంట్రమ్ కేపిటల్ షేర్లు.. 19 శాతం పెరిగాయ్..

2021-10-13 11:23:38 By VANI

img

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెంట్రమ్ గ్రూప్-భారత్‌పే కన్సార్టియమ్‌కు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్‌ఎఫ్‌బీ) లైసెన్స్‌ను జారీ చేసింది. దీంతో కంపెనీ షేర్లు రాకెట్‌లా ఆకాశానికి దూసుకుపోయాయి. బుధవారం బీఎస్ఈలో ఇంట్రా-డే ట్రేడ్‌లో సెంట్రమ్ కేపిటల్ షేర్లు 19 శాతం పెరిగి రూ.47.65 కి చేరుకున్నాయి. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా విలీనం చేయబడిన రుణదాత కొన్ని వారాల్లో రూ.1500 కోట్ల లోన్ బుక్‌తో కార్యకలాపాలను ప్రారంభిస్తుంది.

 

దాదాపు 6 సంవత్సరాల విరామం తర్వాత కొత్త బ్యాంక్ లైసెన్స్ జారీ చేయబడింది. సెంట్రమ్, భారత్ పే సామర్థ్యాలపై చూపిన విశ్వాసానికి ఆర్‌బీఐకి సెంట్రమ్ కేపిటల్ కృతజ్ఞతలు తెలిపింది. కొత్త SFB 'యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్' గా ఇన్‌కార్పొరేట్ చేయబడింది. ‘‘సెంట్రమ్, భారత్‌పే రెండింటికి పేరుగా ఐక్యత చాలా ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. బ్యాంకును నిర్మించడానికి ఇద్దరు భాగస్వాములు సమానంగా ఏకం కావడం ఇదే మొదటిసారి. 

 

ప్రతిపాదిత వ్యాపార నమూనా సహకారం, ఓపెన్ ఆర్కిటెక్చర్, దాని వాటాదారులందరినీ సీమ్‌లెస్ డిజిటల్ అనుభవాన్ని అందించడానికి ఏకం చేస్తుంది. సెంట్రమ్ విజయవంతమైన MSME, మైక్రో ఫైనాన్స్ వ్యాపారాలు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో విలీనం చేయబడతాయి’’ అని కంపెనీ తెలిపింది. ఉదయం 09:48 గంటలకు సెంట్రమ్ కేపిటల్ స్టాక్ బీఎస్ఈలో 16 శాతం పెరిగి రూ. 46.30 వద్ద ఉంది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌ 0.44 శాతం పెరిగింది. కౌంటర్‌లోని ట్రేడింగ్ వాల్యూమ్‌లు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఇప్పటి వరకూ ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 40.1 మిలియన్ ఈక్విటీ షేర్లు చేతులు మారాయి.  
 


Centrum Capital  Bharatpe  Small Finance Bank  MSME

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending