ఆరంభం అదిరింది... క్లీన్‌సైన్స్‌, జీఆర్‌ ఇన్‌ఫ్రాలు బంపర్‌ లిస్టింగ్‌

2021-07-19 10:36:40 By Marepally Krishna

img

స్టాక్‌ మార్కెట్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాయి క్లీన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, జీఆర్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌. పబ్లిక్‌ ఇష్యూ ఊహించని స్థాయిలో స్పందన రావడంతో  ఈ సంస్థల లిస్టింగ్‌పై భారీ అంచనాలు వచ్చాయి. ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్‌ రావడంతో జీఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ 102.6 రెట్లు, క్లీన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 93 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. 


క్లీన్‌ సైన్స్‌ ఇష్యూ ధర రూ.900 కాగా ఇవాళ రూ.1755 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించి ఇన్వెస్టర్లకు చక్కని లాభాలను పంచింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే డే గరిష్ట స్థాయి రూ.1770.65కు చేరిన క్లీన్‌సైన్స్‌ షేర్‌ ఆ తర్వాత ఒక్కసారిగా లాభాల స్వీకరణకు గురై 1555.05కు పడిపోయింది. ప్రస్తుతం డే కనిష్ట స్థాయికి సమీపంలో 77శాతం ప్రీమియంతో రూ.1592.20 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఇవాళ ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఈలో 81.20 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.16,963 కోట్లకు చేరింది. 

Clean Science IPO Shares List At Rs 1,784.4, A 98% Premium Over Issue Price


ఇక జీఆర్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ విషయానికి ఇష్యూ ధర రూ.837 కాగా ఇవాళ రెట్టింపు స్థాయికి కాస్త ఎగువన రూ.1715.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ స్టాక్‌ కూడా క్లీన్‌ సైన్సెస్‌ మాదిరిగానే హైయర్‌ లెవల్స్‌లో లాభాల స్వీకరణకు గురవుతోంది. ఇంట్రాడేలో రూ.1732.25కు చేరి గరిష్ట స్థాయిని నమోదు చేసిన ఈ స్టాక్‌ ఒకదశలో రూ.1550కు పడిపోయింది. ప్రస్తుతం కోలుకున్న ఈ స్టాక్‌ 96శాతం లాభంతో రూ.1641 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఇవాళ ఇప్పటివరకు 75.28 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.15,877 కోట్లకు చేరింది. 

GR Infraprojects IPO is for long term investors, say analysts | Business  Insider India


bse nse sensex nifty stock market telugu