నవంబరు చివరివారంలో స్టార్ IPO

2021-11-22 10:09:11 By Y Kalyani

img

నవంబరు చివరివారంలో స్టార్ IPO

స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ. 7,500 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను నవంబర్ చివరి వారంలో తీసుకొస్తోంది. 2021లో Paytm మరియు Zomato తర్వాత మూడవ అతిపెద్ద ఐపీఓగా రానుంది. PAYTM రూ. 18,300 కోట్లు మరియు జమోటో రూ. 9,375 కోట్లు సమీకరించింది. 
స్టార్ కంపెనీ నవంబర్ 30న ఇష్యూను ప్రారంభించేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే మార్కెట్ పరిస్థితులను బట్టి వారు నిర్ణయం తీసుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇష్యూ ధర దాదాపు రూ. 900 వరకు ఉండవచ్చు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థ. మార్కెట్ క్యాప్ రూ. 51,000 కోట్లు అంటే 7 బిలియన్ డాలర్లు వద్ద అంచనా వేస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ ఇన్సూరెన్స్ మార్కెట్‌ప్లేస్ పాలసీబజార్ ఇటీవల లిస్ట్ అయింది. PB ఫిన్‌టెక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.59,824 కోట్లుగా ఉంది. 
రాకేష్ జున్‌జున్‌వాలాకు ఇందులో కీలక వాటాలున్నాయి. స్టార్ హెల్త్ యొక్క IPOలో రూ. 2,000 కోట్ల తాజా ఇష్యూ కాగా.. ప్రమోటర్లతో సహా ప్రస్తుత వాటాదారుల ద్వారా రూ. 5,500 కోట్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ పెడుతున్నారు. సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్స్, కోణార్క్ ట్రస్ట్ మరియు MMPL ట్రస్ట్ ఉన్నారు. నాన్-ప్రమోటర్లలో, Apis గ్రోత్, యూనివర్శిటీ ఆఫ్ నోట్రే డామ్ మరియు MIO స్టార్ కూడా తమ వాటాలను తగ్గించుకుంటాయి.
ప్రస్తుతం, ప్రమోటర్లకు కంపెనీలో 62.80% వాటా ఉంది. కంపెనీలో సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా ఎల్‌ఎల్‌పికి 45.32%, బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా మరియు అతని భార్య రేఖా జున్‌జున్‌వాలా కలిసి 17.26% వాటాను కలిగి ఉన్నారు.


star ipo news

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending