సోనా కామ్‌స్టార్‌ ఇష్యూ ధర ఫిక్స్ రూ285-291

2021-06-10 08:40:11 By Y Kalyani

img

సోనా కామ్‌స్టార్‌ ఇష్యూ ధర ఫిక్స్  రూ285-291

ఈ నెల 14వ తేదీన పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్న ఆటో కాంపోనెంట్ తయారీ కంపెనీ షేరు ధరను రూ.285-291గా నిర్ణయించారు. ఇష్యూ పరిమాణం రూ.5,550 కోట్లు. జూన్‌ 14న ప్రారంభమై 16వ తేదీన ముగుస్తుంది. ఇష్యూలో భాగంగా రూ.5,250 కోట్ల వాటాలు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ బాటలో విక్రయించి మిగతా రూ.300 కోట్లు ఈక్విటీ షేర్లుగా జారీ చేస్తారు. రూ.241 కోట్ల రుణభారం తగ్గించుకుంటుంది. ఇతర సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించుకోనుంది. మొత్తం షేర్లలో 75 శాతం క్యూఐబీలకు, 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బిడ్డర్లకు కేటాయించి మిగతా 10 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయిస్తున్నారు. 

అమెరికాకు చెందిన అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ కంపెనీల్లో ఒక్కటైన బ్లాక్ స్టోన్ కంపెనీ నియంత్రిత వాటా కలిగిన ఆటో కాంపోనెంట్ కంపెనీ సోనీ కామ్ స్టర్ కు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. దీనికి సంబంధించి కోటక్ మహీంద్రా కేపిటల్, JM ఫైనాన్షియల్, క్రెడిట్ స్యూస్ కంపెనీలు అడ్వైజరీ సంస్థలుగా నియమించింది. ముందుగా 6వేల కోట్ల వరకూ సమీకరించాలని భావించినా కూడా తర్వాత దీనిని 5500 కోట్లకు పరిమితం చేసింది. ఆటో కాంపోనెంట్ సెగ్మెంట్లో అతిపెద్ద IPOగా చరిత్ర స్రుష్టించనుంది.

Sona Comstar ప్రొఫైల్...

సోనీ కామ్ స్టర్ 2024 నాటికి టాప్ 4 ఆటో కాంపొనెంట్ కంపెనీల్లో ఒక్కటిగా ఎదగాలని లక్ష్యం పెట్టుకుంది. కంపెనీకి ప్రస్తుతం 9 యూనిట్లు ఉన్నాయి. ఇండియా, చైనా, మెక్సికో, అమెరికా దేశాల్లో ప్రొడక్షన్ సెంటర్స్ ఉన్నాయి. 2019లో కంపెనీ 1900 కోట్ల ఆదాయన్ని చూపించింది. 2024 నాటికి బిలియన్ డాలర్ రెవిన్యూ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీకి ఫోర్డ్, దైమ్లర్, టాటా, అశోక్ లాలేండ్ వంటి కంపెనీలు క్లయింట్లుగా ఉన్నారు. ఫోర్జ్డ్ గేర్స్ లో అతిపెద్ద ఉత్పత్తిదారుల్లో ఒక్కటిగా ఉంది. 2026 నాటికి మనదేశం నుంచి 80బిలియన్ డాలర్ల ఎగుమతులు ఉంటాయని అంచనా. కంపెనీలో ప్రస్తుతం 65శాతం స్టేక్ బ్లాక్ స్టోన్ కంపెనీకి ఉంది. 35శాతం సంజయ్ కపూర్ కు ఉంది. 


ipo market trends stocks bse nifty sona camster

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending