ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

2021-09-23 10:34:01 By VANI

img

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓకి సిద్ధమవుతోంది. ఈ నెల ముగియక ముందే కంపెనీ ఐపీఓకి రానుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.3000 కోట్లను సమీకరించనుంది. సంస్థ ఐపీఓ కోసం ఏప్రిల్ నెలలో సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను దాఖలు చేసింది. ఈ మేరకు సెబీ ఆగస్ట్ నెలలో ఐపీఓ డాక్యుమెంట్లను క్లియర్ చేసింది. ఆఫర్ డాక్యుమెంట్ ప్రకారం, కెనడియన్ సంస్థ సన్ లైఫ్ ఫైనాన్షియల్ సంస్థ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించనుండగా.. సన్ లైఫ్ కంటే ఒక శాతం తక్కువగా ఆదిత్య బిర్లా కేపిటల్ విక్రయించనుంది.


ప్రస్తుతం ఏఎమ్సీలో ఏబీసీఎల్ 51 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన 49 శాతాన్ని సన్ లైఫ్ కలిగి ఉంది. మొత్తం ప్రమోటర్ వాటా ఈ విక్రయంతో 100 శాతం నుంచి 86.5 శాతానికి పడిపోనుంది. ఆదిత్య బిర్లా ఎంఎఫ్ సంస్థ జూలై 2021 నాటికి రూ.3 ట్రిలియన్లకు పైగా ఎక్కువ నిర్వహణ (AUM) ఆస్తులతో దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ యేతర అనుబంధ ఫండ్ హౌస్ గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఫండ్ హౌస్ పన్ను తరువాత లాభం (PAT) రూ .155 కోట్లు ఆర్జించింది. దేశీయ ఎంఎఫ్ పరంగా చూస్తే ఆదిత్య బిర్లా ఎంఎఫ్ ఐపీఓ నాల్గవది కావడం గమనార్హం.


Aditya Birla Sun Life  Sebi  IPO  Aditya Mutual Fund  Sun Life Financial

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending