PAYTM ఐపీఓ కు గ్రీన్ సిగ్నల్... దీపావళి తర్వాతే

2021-10-22 22:55:03 By Y Kalyani

img

PAYTM ఐపీఓ కు గ్రీన్ సిగ్నల్... దీపావళి తర్వాతే

వివాదాలు, విమర్శలు.. రకరకాల ఊహాగానాలతో ఆలస్యం అయిన పేటీఎమ్ ఐపీఓకు ఎట్టికేలకు మోక్షం లభిస్తోంది. ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ పేటీఎమ్ పేరెంట్ కంపెనీ One97 కమ్యూనికేషన్స్ సంస్థకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI లిస్టింగ్ కు అనుమతి ఇచ్చింది.  రూ .16,600 కోట్లతో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ తో రానుంది.   ఇందులో రూ .8,300 కోట్లు ఫ్రెష్ ఇష్యూ కాగా.. మరో రూ .8,300 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో వస్తోంది. సంస్థలో ఉన్న పెట్టుబడిదారులు తమ వాటాలను విక్రయించనున్నారు.  జులైలోనే సెబీకి ధరఖాస్తు చేసింది. అయితే కొన్ని అభ్యంతరాలు రావడంతో ఆలస్యం అయింది. తాజాగా సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక దీపావళి అనంతరం నవంబర్ లో మార్కెట్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. 

బిగ్గెస్ట్ IPO..
ఇప్పటివరకు భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా PAYTM రికార్డు స్రుష్టించబోతుంది. అంతకుముందు కోల్ ఇండియా రూ .15,000 కోట్లను సమీకరించింది. ఇది వచ్చి కూడా పదేళ్లు దాటింది. 
2000 లో విజయ్ శేఖర్ శర్మ One97 దీనిని ప్రారంభించింది. ఆన్‌లైన్ మొబైల్ చెల్లింపుల్లో అతిపెద్ద సంస్థగా మారింది. 

గత సంవత్సరం అంటే  కంపెనీ 20-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,540 కోట్లు ఆదాయం చూపించింది. అంతకుముందు ఏడాది రూ .2,942 కోట్ల నుంచి నష్టాలను రూ .1,701 కోట్లకు తగ్గించింది. పేటీఎంకు గ‌త మార్చి నెలాఖ‌రు నాటికి 2.1 కోట్ల పై చిలుకు మ‌ర్చంట్లు, 33.3 కోట్ల మంది యూజ‌ర్లు ఖాతాదారులుగా ఉన్నారు. 


paytm ipo latest news

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending