వచ్చే వారమే Oyo ఐపీఓ ఫైలింగ్

2021-09-23 08:58:47 By Y Kalyani

img

వచ్చే వారమే Oyo ఐపీఓ ఫైలింగ్

SoftBank కీలక వాటా కలిగిఉన్న ఆన్ లైన్ హాస్పిటాలిటీ కంపెనీ ఓయో వచ్చే వారం 1 బిలియన్ డాలర్ సమీకరించేందుకు IPO కోసం ఫైల్ చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ధరఖాస్తు రెడీ చేసినట్టు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ బ్యాక్డ్ ఇండియన్ హాస్పిటాలిటీ స్టార్టప్ ఓయో హోటల్స్ అండ్ రూమ్స్ వచ్చే వారం ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం సుమారు 1 బిలియన్ డాలర్లను సమీకరించే అవకాశం ఉందని ఎకనామిక్ టైమ్స్ కథనం రాసింది. 

దేశీయ స్టాక్ మార్కెట్లో IPO సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. PAYTM వచ్చేస్తోంది. జొమోటో ఎంట్రీ ఇచ్చింది. త్వరలో పాలసీ బజార్ వచ్చేస్తోంది. ఇక ఓలా కంపెనీ కూడా ప్లానింగ్  చేస్తోంది. ఆతిధ్య రంగంలో ఉన్న Oyo తాజాగా జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంస్థ CFO అభిషేక్ గుప్తా క్లారిటీ ఇచ్చారు. ఐపీఓకు సిద్దమవుతున్నామని.. అయితే అంతకంటే ముందు చేయాల్సిన పనులు పూర్తి చేసి.. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో లిస్టింగ్ అయ్యే అవకాశాలున్నాయని అభిషేక్ గుప్తా ప్రకటించారు. ఆడిటింగ్ టీమ్ అదే పనిలో ఉందని.. చిన్న చిన్న నట్లు. బోట్లు సరిచేయాల్సి ఉందని.. అన్నీ పూర్తి చేసి.. మంచి టైం చూసుకుని అడుగుపెడతామంటున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లో ఐపీఓలకు మంచి డిమాండ్ తో పాటు.. ఇన్వెస్టర్ల నుంచి రెస్పాన్స్ భాగుందని అంటున్నారు.
దేశీయంగా ఆతిథ్య రంగంలో కొవిడ్ పెద్ద సంక్షోభం తీసుకొచ్చిందని.. అయినా ప్రస్తుతం 50 నుంచి 60శాతం వరకూ రికవరీ అయినట్టు చెబుతున్నారు. మరికొంత సమయం తీసుకుంటే మార్కెట్ ప్రీ కొవిడ్ లెవల్ కు వస్తుంది.. ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపడానికి అవకాశం ఉంటుందని.. అన్ని పరిశీలించిన తర్వాతే ఐపీఓ ఉంటుందని స్పష్టత వచ్చారు.  


IPO News IPO IPO Updates oyo hotel drhp

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending