ఐపీఓ డేట్ ఫిక్స్ చేసిన Nykaa

2021-10-22 08:44:22 By Y Kalyani

img

ఐపీఓ డేట్ ఫిక్స్ చేసిన Nykaa

బ్యూటీ స్టార్టప్ కంపెనీ Nykaa  ఐపీఓ డేట్స్ ఫిక్స్ చేసింది. అక్టోబర్ 28న ఆఫర్ మొదలై నవంబర్ 1న ముగుస్తుంది. కంపెనీ మొత్తం రూ.5200 కోట్లు సమీకరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ రూ.630 కోట్లుగా ఉంటుంది. మొత్తం 41,972,5660 షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కు అందుబాటులో ఉంటాయి. కంపెనీ వాల్యయేషన్ 7.4 బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. 

మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఫల్గుని నాయర్ నేతృత్వంలోని నైకా బ్యూటీ స్టార్టప్‌లలో లిస్టింగ్ అవుతున్న కంపెనీల్లో ఒకటి. ఈ సంస్థ 2012 లో మొదలైంది. బ్యూటీ ఉత్పత్తులకు గమ్యస్థానంగా ఉంది. కంపెనీకి FY21లో ఆదాయం రూ .2,440 కోట్లుగా ఉంది. TPG ప్రముఖ ఇన్వెస్టర్ ఇందులో పెట్టుబడి పెట్టారు. Nykaa పోర్ట్‌ఫోలియోలో 1,500 బ్రాండ్‌లున్నాయి.


nykaa ipo latest news

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending