ముచ్చటగా 3వసారైనా ముడిపడుతుందా ? లోధా డెవలపర్స్ ఐపిఓ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్- అప్లై చేయాలా వద్దా..!

2021-04-03 10:41:51 By Anveshi

img

వచ్చే బుధవారం(ఏప్రిల్7) నుంచి లోధా డెవలపర్స్ Aka మాక్రోటెక్ డెవలపర్స్ ఐపీఓకి రంగం సిద్ధమైంది. మినిమమ్ 30 షేర్ల లాట్‌తో 10 రూపాయల ఫేస్‌వేల్యూతో ఈ ఐపిఓకి అప్లై చేసుకోవచ్చు. ఒక్కో షేరుకు రూ.483-486 మధ్యలో ప్రైస్‌ బ్యాండ్ ఫిక్స్ చేశారు. జనరల్‌గా అప్పర్ ప్రైస్ బ్యాండ్ లేదంటే రౌండప్ చేయడానికి వీలుగా  రూ.485 దగ్గర షేర్ ఇష్యూ ప్రైస్ ఫిక్స్  చేయవచ్చు. ఈ మధ్యకాలంలో మంచి ఫెయిర్ వేల్యూ ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఐపిఓకి రాలేదు కానీ..అసలు లోధా డెవలపర్స్ ఐపిఓ గురించి ఇంకా బోలెడన్ని ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఉన్నాయ్. అవేంటో చూడండి ఫస్ట్ పాయింట్ అసలు లోథా డెవలపర్స్ ఐపిఓకి రావాలనుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. మూడోసారి

మొదటిసారి
2009, సెప్టెంబర్‌లో లోధా డెవలపర్స్ ఐపిఓ కోసం రంగం సిద్ధం చేసుకుంది. అప్పట్లో 2800కోట్ల రూపాయల నిధుల సమీకరణను ఐపిఓతో చేయాలని వ్యూహం రచించుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఏర్పడటంతో తన ప్రయత్నాన్ని విరమించుకుంది

రెండోసారి
తర్వాత 2018లో కూడా ఐపీఓతో స్టాక్ మార్కెట్లలోకి ఎంట్రీ కోసం ప్రయత్నించింది లోధా డెవలపర్స్ సంస్థ. కానీ రెండోసారి కూడా ఆ సంస్థకి నిరాశే మిగిలింది.రెండోసారి తన ప్రయత్నానికి బ్రేకులు పడటానికి కారణం, అప్పట్లో రియల్ఎస్టేట్ రంగం డల్‌గా ఉండటమే. ఆ సమయంలోనే భారీ సంస్థలు బకాయిల ఊబిలో కూరుకుపోయి డిఫాల్ట్ కూడా అయ్యాయ్

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి 2021లో లోధా డెవలపర్స్ తన లక్ టెస్ట్ చేసుకోబోతోంది. ఐతే ఈసారీ రిస్కే  తీసుకుంటుందని చెప్పాలి. ఎందుకంటే గత ఏడాది కాలంగా మనల్ని కరోనా పట్టి పీడిస్తోంది. ఓ దశ ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డాంరా బాబూ అనుకునేలోపే రెండోదశ ప్రారంభమైంది. ఎక్కడికక్కడ కరోనా కేసులు  వేలాదిగా బయటపడుతున్నాయ్. ఇలాంటి తరుణంలో లోధా డెవలపర్స్ ఏప్రిల్ 7 నుంచి ఐపిఓ ఇష్యూకి వస్తోంది

ఎవరెవరు ఎంతెంత..?
లోధా డెవలపర్స్ ఐపిఓకి 30 ఈక్విటీ షేర్లు చొప్పున లాట్‌కి రూ.483-486 రేటుతో కనీసం రూ.14580 వెచ్చించి రిటైల్  ఇన్వెస్టర్లు ధరఖాస్తు చేయవచ్చు.మొత్తం ఇష్యూ సైజ్ రూ.2500కోట్లు. ఇందులో సగం క్వాలిఫైడ్ ఇన్సిట్యూషనల్ బయ్యర్లు- ఐబిలకు రిజర్వ్ చేశారు. అంటే రూ.1250 కోట్ల విలువైన షేర్లకు మాత్రమే రిటైల్ ఇన్వెస్టర్లు అప్లై చేసుకునే కోటా. ఇందులో  కూడా నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు మరో 15శాతం రిజర్వ్ చేసారు. అంటే ఇక నిఖార్సైన రిటైల్ ఇన్వెస్టర్లకు బిడ్ చేసే షేర్లు 35శాతం మాత్రమే అందుబాటులో ఉంటాయ్.  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీగా స్పందనే కనబడవచ్చు. సగం  క్యుఐబిలకు రిజర్వ్ చేశారంటే ఆల్రెడీ లోధా డెవలపర్స్ మనసులో కొంతమంది ఇన్వెస్టర్లు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ కింద రూ.30కోట్ల విలువైన షేర్లను రిజర్వ్ చేశారు.

ఐపిఓతో సమీకరించిన ధనాన్ని- అప్పులను తగ్గించుకునేందుకు, భూములు కొనుగోలు, డెవలప్‌మెంట్‌కి  వినియోగిస్తామంటూ మేక్రోటెక్ డెవలపర్స్(Macrotech developers)చెప్తోంది.

రిస్క్ ఫ్యాక్టర్స్
సేమ్..మనం ముందు చెప్పినట్లు కరోనా కేసులు పెరగడమే అని కేపిటల్‌వయాగ్లోబల్ రీసెర్చ్ అనలిస్ట్ విశాల్ బలభద్రుని కూడా అభిప్రాయపడ్డారు

కంపెనీ హిస్టరీ ..!
1995 ముంబైలో ప్రారంభమైందీ సంస్థ.  రియల్ఎస్టేట్ డెవలప్‌మెంట్ వ్యాపారంలో ఈ సంస్థ 2017నాటికి లయసేస్ ఫోరాస్  అంచనా ప్రకారం రెసిడెన్షియల్ సేల్స్‌లో దేశంలోనే అతి పెద్ద రియల్ఎస్టేట్ డెవలపర్‌గా  పేరు తెచ్చుకుంది. ముంబై  మెట్రోపాలిటన్ రీజియన్‌, పూణే,లండన్‌లో పలు ప్రాజెక్టులు నిర్వహించింది. రూ.35లక్షల నుంచి 59కోట్లరూపాయల రేటు పలికే హౌసింగ్ యూనిట్ల విక్రయాలు చేయడంలో దిట్ట. కమర్షియల్ సెక్టార్‌లో ఆఫీస్, రిటైల్ ప్రాజెక్టులను లీజు, సేల్ మోడల్స్‌లో వ్యాపారం చేస్తుంది. లోధా డెవలపర్స్ బ్రాండ్ కింద కాసా బై లోధా, లోధా, లోధా లగ్జరీ బ్రాండ్ పేర్లతో అందుబాటులో ఇళ్ల  నిర్మాణం నుంచి ప్రీమియం లగ్జరీ ఇళ్లు నిర్మిస్తుంది. ఆలానే ఆఫీస్ స్పేస్‌లో ఐథింక్, లోధా ఎక్సెలస్, లోధా సుప్రీమస్ బ్రాండ్లతో యూనిట్లు విక్రయిస్తుంది

నాలుగేళ్ల క్రితమే కంపెనీ చేతిలో 37 ప్రాజెక్టులు( 35 దేశంలో, లండన్‌లో2) ఉన్నాయి. ఆ తర్వాత మరో 22 ప్రాజెక్టులు  64.21 మిలియన్ స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ప్లాన్ చేసింది

ప్రమోటర్లు ఎవరంటే
మంగళ్ ప్రభాత్ లోధా, అభిషేక్ మంగళ్ ప్రభాత్ లోధా

ఇష్యూ ఇంపార్టెంట్ డేట్స్

ఏప్రిల్ 7-9 ఇష్యూ ప్రారంభ,ముగింపు తేదీలు

ఏప్రిల్ 16-అలాట్‌మెంట్ 

ఏప్రిల్ 22- లిస్టింగ్ డేట్( tentative)


లీడ్ మేనేజర్స్
ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఎడెల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జేఎం ఫైనాన్షియల్, యెస్ సెక్యూరిటీస్,ఎస్‌బిఐ కేపిటల్ మార్కెట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా కేపిటల్ మార్కెట్స్

గ్లోబల్ కో ఆర్డినేటర్స్
యాక్సిస్ కేపిటల్, జేపీ మోర్గాన్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్, కోటక్ మహీంద్రా కేపిటల్ కంపెనీ లిమిటెడ్,

ఐపిఓ రిజిస్ట్రార్
లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్

లీడ్ మేనేజర్స్, గ్లోబల్ కోఆర్డినేటర్లను చూశారుగా..పెద్ద పెద్ద పేర్లే కన్పిస్తున్నాయ్. అంటే ఇన్వెస్టర్ల స్పందనకేం తక్కువ ఉండదు. ఐతే ఇప్పుడు మెయిన్ కన్సర్న్( ప్రధానంగా గమనించాల్సిన) ఏమిటంటే, కరోనా వైరస్ వ్యాప్తే..ఈ కారణంగా రియాల్టీ రంగంపై ఏదైనా దెబ్బ పడితే ఈ ఐపిఓపై కూడా ప్రతికూల ప్రభావమే పడుతుంది

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending