-->

ఐపీఓ కోసం ముచ్చటగా మూడో ప్రయత్నంలో లోధా గ్రూప్

2021-01-09 12:17:08

img

రియాల్టీ కంపెనీ లోధా మరోసారి IPO ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించి విఫలమైన కంపెనీ.. ఈ ఏడాది ఎలాగైనా ప్రైమరీ మార్కెట్లో నిధుల సమీకరణకు రావాలని ప్రయత్నిస్తోంది. గతంలో లోధా పేరుతో ఉన్న మాక్రోటెక్ డెవలపర్స్ 2009, 2018లో రెండుసార్లు IPO ప్లాన్లు వేసి విఫలమయ్యారు. 


1995లో స్థాపించిన మంగళ్ ప్రభాత్ లోధా ప్రమోట్ చేసి లోధా డెవలపర్స్ కంపెనీ 2018లో స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ప్రయత్నాలు చేశారు. రూ.5000 కోట్లు సమీకరించేందుకు IPOకు అనుమతులు కూడా వచ్చాయి. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు వెళ్లలేదు. అంతకుముందు 2009లో కూడా రూ.2500 కోట్లు సమీకరించడానికి DRHP కూడా సబ్మిట్ చేశారు. కానీఆచరణకు నోచుకోలేదు. అప్పుడు రెసిషన్ కారణంగా వాయిదా వేశారు. 


మళ్లీ ఇంతకాలానికి IPOకు సిద్దమైంది కంపెనీ. ముంబై, లండన్ వంటి మెట్రో నగరాలతో పాటు హైదరాబాదులోనూ లగ్జరీ హౌసింగ్ కాంప్లెక్స్ లు చేపడుతున్న కంపెనీ మార్చిలో IPOకు ధరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఇపప్పటికే సంస్థలతో చర్చలు జరుపుతోంది.
రియాల్టీలో లోధా టవర్స్ మాత్రమే కాదు.. ముంబైకే చెందిన పురానికా బిల్డర్స్ కూడా 1000 కోట్లు సమీకరించేందుకు IPOకు ధరఖాస్తు చేసుకున్నారు.