ఈనెల 18న ఐపీఓకు రానున్న లగ్జరీ, ప్రీమియం వాచీల రిటైల్ సంస్థ ఎథోస్
ఈనెల 20న ముగిసే ఈ ఇష్యూ ప్రైస్ బాండ్ ఒక్కో షేరుకు రూ.836-878
ఇష్యూలో భాగంగా రూ.375 కోట్ల తాజా షేర్లను జారీ చేయనున్న కంపెనీ
ఓఎఫ్ఎస్ పద్ధతిలో 11.08 లక్షల షేర్లను విక్రయించనున్న కంపెనీ
మొత్తం ఇష్యూ ద్వారా రూ.472.3 కోట్ల నిధులను సమీకరించనున్న ఎథోస్
వీనస్ పైప్స్ ఐపీఓకు తొలిరోజూ 2.37 రెట్ల స్పందన
రిటైల్ సెగ్మెంట్లో 4.10 రెట్లు, క్యూఐబీలో 36 శాతం, సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 98 శాతం చొప్పున స్పందన
డెల్హివరీ ఐపీఓకు తొలిరోజూ 0.21 రెట్ల స్పందన
రెండోరోజూ ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ ఐపీఓకు 0.57 రెట్ల స్పందన, ఇవాళ్టితో ముగియనున్న ఇష్యూ
ఏషియన్ గ్రావిటో ఇండియా ఐపీఓకు 1.27 రెట్ల స్పందన
ఎల్ఐసీ ఐపీఓ..
ఇవాళ షేర్లను కేటాయించనున్న ఎల్ఐసీ
షేర్ల కేటాయింపు జరగనివారికి రేపు డబ్బులు రీఫండ్
మే 16న డీమ్యాట్ ఖాతాల్లో క్రెడిట్ కానున్న షేర్లు
ఈనెల 17న బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ కానున్న ఎల్ఐసీ