ఈ ఏడాది 330.6 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ ఐపీఓ ఆదాయంలో ఇండియా వాటా ఎంతంటే..

2021-10-11 12:03:09 By VANI

img

70 కి పైగా కంపెనీలు తమ ప్రారంభ వాటా విక్రయాలతో బయటకు రావడంతో, ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో 9.7 బిలియన్ డాలర్ల ఆదాయంలో ఇండియా అగ్రశ్రేణి ఐపీఓ మార్కెట్‌లలో ఒకటిగా ఎదిగి ఉండవచ్చు కానీ ఆ మొత్తం అదే సమయంలో సేకరించిన మొత్తం ప్రపంచ ఐపీఓ నిధులతో పోల్చితే మాత్రం కేవలం 3 శాతం మాత్రమే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఐపీఓల ద్వారా ఈ ఏడాది ప్రారంభం నుంచి సెప్టెంబర్ వరకూ 330.66 బిలియన్ డాలర్లు సేకరించబడ్డాయి.

 

ప్రముఖ కన్సల్టెన్సీ EY నివేదిక ప్రకారం.. 2021 జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో భారతదేశంలో మొత్తం 72 ఐపీఓల ద్వారా మొత్తం ఐపీఓలలో 4.4 శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 2021 జనవరి-సెప్టెంబర్ కాలంలో 1,635 ఐపీఓలు ఉన్నాయి. NASDAQ, NYSE స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఐపీఓల ఆదాయాల పరంగా యూఎస్ అగ్రస్థానంలో ఉందని, ఆ తర్వాత చైనాలోని షాంఘై, హాంకాంగ్ తర్వాతి స్థానంలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. మొత్తం మీద భారతదేశంలో మెగా ఐపీఓ పైప్‌లైన్ నిర్మాణాన్ని నిర్వహిస్తూనే అనేక మార్కెట్లలో ఐపీఓ కార్యకలాపాల ఆరోగ్యకరమైన వ్యాప్తి ఉంది
 


India  IPO  NASDAQ  NYSE

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending