ఐపీఓకి సిద్ధమవుతున్న గోదావరి బయోరిఫైనరీస్.. సెబీకి డ్రాఫ్ట్ పేపర్ల దాఖలు

2021-09-26 15:16:36 By VANI

img

తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద గోదావరి బయోరిఫైనరీస్‌ డ్రాఫ్ట్ పేపర్లను దాఖలు చేసింది. డ్రాఫ్ట్ పేపర్స్ ప్రకారం.. తాజాగా రూ.370 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా 65,58,278 ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, పెట్టుబడిదార్లు విక్రయించనున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో సమీర్‌ శాంతిలాల్‌ సోమయ్య, సోమయ్య ఏజెన్సీస్‌ ఒక్కొక్కటి 5 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయిస్తాయి. కాగా.. మండల క్యాపిటల్‌ 49.27 లక్షల షేర్ల వరకూ, ఫిల్‌మీడియా కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ 3 లక్షల వరకు ఈక్విటీ షేర్లు, అలాగే సోమయ్య ప్రోపర్టీస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 1.31 లక్షల వరకు షేర్లు, లక్ష్మీవాడి మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ ద్వారా 2 లక్షల వరకు షేర్లు విక్రయిస్తారు. 

 

రూ. 100 కోట్ల వరకూ ప్రీ-ఐపిఒ ప్లేస్‌మెంట్‌ను కంపెనీ పరిగణించవచ్చు. అటువంటి ప్లేస్‌మెంట్ పూర్తయితే, తాజా ఇష్యూ పరిమాణం తగ్గుతుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ రుణ చెల్లింపులు, చెరకు క్రషింగ్‌ విస్తరణకు మూలధన వ్యయాలు, పొటాష్‌ యూనిట్‌ విస్తరణ, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. భారతదేశంలో ఇథనాల్ ఆధారిత రసాయనాల తయారీలో, ప్రముఖ ఇథనాల్ ఉత్పత్తిదారులలో గోదావరి బయోరిఫైనరీస్ ఒకటి. వైవిధ్యభరితమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో బయో ఆధారిత రసాయనాలు, చక్కెర, ఇథనాల్, ఇతర గ్రేడ్ ఆల్కహాల్, పవర్ ఉన్నాయి. ఈక్విరస్ క్యాపిటల్, జేఎమ్ ఫైనాన్షియల్‌లు ఇష్యూ లీడ్ మేనేజర్స్‌గా వ్యవహరించనున్నాయి. 


Equirus Capital  JM Financial  Godavari Biorefineries  Sameer Shanthilal Somaiah  Somaiah Agencies  Somaiah Properties

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending