IPOకు వస్తున్న గోదావరి బయోఫైనరీస్

2021-09-26 10:06:47 By Y Kalyani

img

IPOకు వస్తున్న గోదావరి బయోఫైనరీస్

IPO ద్వారా నిధులను సేకరించడానికి గోదావరి బయోఫైనరీస్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. IPOలో రూ. 370 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు జారీచేస్తారు. ప్రమోటర్లు, పెట్టుబడిదారుల ద్వారా 65,58,278 ఈక్విటీ షేర్ల ఆఫర్ కు పెట్టినట్టు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ DRHPలో తెలిపారు.  OFS లో సమీర్ శాంతిలాల్ సోమయ్య మరియు సోమయ్య ఏజెన్సీలు ఒక్కొక్కటి 5 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయిస్తాయి. మండల క్యాపిటల్ ద్వారా 49.27 లక్షల వరకు, ఫిల్మీడియా కమ్యూనికేషన్ సిస్టమ్స్ ద్వారా 3 లక్షల వరకు ఈక్విటీ షేర్లు, సోమయ్య ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా 1.31 లక్షల ఈక్విటీ షేర్లు మరియు లక్ష్మీవాది మైన్స్ మరియు మినరల్స్ ద్వారా 2 లక్షల వరకు ఈక్విటీ షేర్లు విక్రయానికి పెడుతున్నారు.  రూ. 100 కోట్ల వరకు ప్రీ-ఐపిఒ ప్లేస్‌మెంట్‌ను కంపెనీ ఇవ్వొచ్చు. ప్లేస్‌మెంట్ పూర్తయితే ఇష్యూ పరిమాణం తగ్గుతుంది.

ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని అప్పు చెల్లింపులకు, చెరకు క్రషింగ్ విస్తరణ కోసం మూలధన వ్యయంగా వినియోగిస్తారట. పొటాష్ యూనిట్ తో పాటు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

భారతదేశంలో ఇథనాల్ ఆధారిత రసాయనాల తయారీలో గోదావరి బయోఫైనరీస్ ప్రముఖ ఇథనాల్ ఉత్పత్తిదారులలో ఒకరుగా ఉన్నారు. వైవిధ్యభరితమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో బయో ఆధారిత రసాయనాలు, చక్కెర, ఇథనాల్, ఇతర గ్రేడ్ ఆల్కహాల్ మరియు పవర్ ఉన్నాయి. ఇథనాల్ కు డిమాండ్ పెరుగుతోంది. 


IPO News IPO IPO Updates

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending