ఈనెల 27 నుంచి గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ ఐపీఓ ప్రారంభం

2021-07-22 08:51:34 By Marepally Krishna

img

- ఈనెల 27-29 వరకు గ్లెన్‌ మార్క్‌ లైఫ్‌ ఐపీఓ

- ఇష్యూ ద్వారా రూ.1513.60 కోట్లను సమీకరించనున్న కంపెనీ

- ఇష్యూ ప్రైస్‌ బాండ్‌ ఒక్కో షేరుకు రూ.695-720

- ఇష్యూలో రూ.900 కోట్ల తాజా షేర్ల జారీ

- ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా 6.30 మిలియన్‌ షేర్ల విక్రయం

- ఆగస్ట్‌ 6న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానున్న గ్లెన్‌మార్క్‌ లైఫ్‌

 

ఈనెల 27 నుంచి 29 వరకు ఐపీఓకు వస్తున్నట్టు గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రకటించింది. ఇష్యూ ధరను ఒక్కో షేరుకు 695 నుంచి 720గా కంపెనీ నిర్ణయించింది.  ఇష్యూ ద్వారా కంపెనీ ఒక వెయ్యి 513 కోట్ల రూపాయల నిధులను సమీకరించే లక్ష్యంతో ఉంది. ఈనెల 26న యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించిన గ్లెన్‌మార్క్‌, ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను ఏపీ వ్యాపారం స్పిన్‌-ఆఫ్‌, కొనుగోళ్ళకు వినియోగించనున్నట్టు తెలిపింది. అలాగే మిగిలిన మొత్తాన్ని మూలధన వ్యయ అవసరాలకు వినియోగించనున్నట్టు వెల్లడించింది. ఆగస్ట్‌ 6న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ లిస్ట్‌ కానుంది.


bse nse sensex nifty stock market telugu