అప్పుడు వద్దనుకుంది.. ఇప్పుడు మళ్లీ వస్తోంది

2021-05-03 22:58:50 By Y Kalyani

img

అప్పుడు వద్దనుకుంది.. ఇప్పుడు మళ్లీ వస్తోంది

తమిళనాడుకు చెందిన Chemplast Sanmar కంపెనీ మళ్లీ స్టాక్ మార్కెట్లోకి వస్తోంది. దాదాపు 10 ఏళ్ల క్రితం డిలిస్ట్ అయిన కంపెనీ మళ్లీ కొత్తగా స్టాక్ మార్కెట్లో IPOకు వస్తోంది. డ్రాఫ్ట్ రెడ్ హేరింగ్ ప్రాస్పక్టస్ DRHP సమర్పించింది. రూ.3500 కోట్లు సమీకరించనున్నట్టు కంపెనీ ఫైలింగ్ తో పేర్కొంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 2500 కోట్లు ఫ్రెష్ ఇష్యూ 1500 కోట్లుగా తెలిపింది. 
తమిళనాడుకు చెందిన Sanmar గ్రూపులోని కంపెనీ ఇది. గతంలో లిస్ట్ అయిన ఈ కంపెనీ 2012 జూన్ లో BSE, NSE, MSE నుంచి డిలిస్ట్ అయింది. ఈ కంపెనీలో కెనడాకు చెందిన బిలియనీర్ ప్రేమబ్ వాత్సాకు కీలక వాటా ఉంది. ఆఫర్ ఫర్ సేల్ లో కంపెనీ 1850 కోట్లు సన్మార్ హోల్డింగ్ కంపెనీ.. 150 కోట్లు సన్మార్ ఇంజినీరింగ్ కంపెనీ విక్రయించనుంది. 
కంపెనీ ఫైనాన్షియల్ ప్రొఫైల్
2020లోChemplast Sanmar కంపెనీ మొత్తం రూ.1265 కోట్లు రెవిన్యూ సాధించింది. అంతకుముందు ఏడాది ఇది 1266 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ తో ముగిసిన 9 నెలల కాలానికి కంపెనీ రూ.877 కోట్లు రెవిన్యూ చూపించింది. నెట్ ప్రాఫిట్ రూ.46.13 కోట్లుగా ఉంది. 


ipo market trends stocks bse nifty

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending